ఆ నొప్పి పోవడానికి సొట్టబుగ్గల చిన్నదాని చిట్కా ఇదే..!
లాక్డౌన్ కారణంగా ఇళ్లలోనే ఉంటున్న సెలబ్రిటీలు ఆరోగ్యంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో పెడుతున్నారు. ప్రధానంగా కరోనా వైరస్ నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించేందుకు కృషి చేస్తున్నారు. అయితే.. తాజాగా.. బాలీవుడ్ బ్యూటీ సొట్టబుగ్గల చిన్నది ప్రీతిజింటా కూడా పలు ఆరోగ్య సమస్యలకు పరిష్కారం చూపుతూ ఓ వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేసింది.
లోయర్ బ్యాక్ సమస్య నుంచి బయటపడేందుకు ఉపయోగపడే వ్యాయామం చేస్తూ వీడియో రూపొందించింది. లోయర్ బ్యాక్ సమస్య పోవడానికి ఇలా చేయడంటూ చూపించింది. ఈ బాధను దూరం చేయడానికి ఇది సులభమైన మార్గమని అందులో పేర్కొంది. *వ్యాయామ ప్రారంభంలో రెండు వైపులా 15 సార్లు కాలు, చేయితో ఇలా చేయటానికి ప్రయత్నించండి. మీరు మంచిగా ఉన్నప్పుడు 30 సెకన్ల పాటు కాలు, చేయిని ఇలా పట్టుకోండి. ఇది సూపర్ ఎఫెక్టివ్. దీన్ని ప్రయత్నించండి* అంటూ ట్వీట్ చేసిందీ చిన్నది. ఈ భామ ముందుముందు మరెన్ని చిట్కాలు చెబుతుందో మరి!
For lower back problems this is the easiest way to strengthen ur lower back & core.Try doing this 15 times on both sides in the beginning.When u get better try holding out ur hand & leg for 30 seconds. It’s super effective. Try it out folks👍 #stayhome #stayfit #pzfit #core #ting pic.twitter.com/9PFstLIAct — Preity G Zinta (@realpreityzinta) April 28, 2020