చిరు వీడియోకు ఎన్టీఆర్ సూప‌ర్ రిప్లే...

VUYYURU SUBHASH

ప్రస్తుతం క‌రోనా లాక్‌డౌన్ నేప‌థ్యంలో టాలీవుడ్ హీరోల మ‌ధ్య బి ద రియ‌ల్ మ్యాన్ ఛాలెంజ్ బాగా వైర‌ల్ అవుతోంది. ఈ క్ర‌మంలోనే ఎన్టీఆర్ విసిరిన ఈ ఛాలెంజ్‌ను మెగాస్టార్ చిరంజీవి స్వీక‌రించారు. చిరంజీవి ఈ రోజు ఇంట్లో క్లీన్ చేయ‌డంతో పాటు దోసెలు వేసి త‌న అమ్మ అంజ‌న‌మ్మ‌కు తినిపించి త‌న అమ్మ‌పై త‌న‌కు ఉన్న అనంత ప్రేమ‌ను చాటుకున్నారు. ఎన్టీఆర్ ఈ ఛాలెంజ్ చిరంజీవితో పాటు అటు విక్ట‌రీ వెంక‌టేష్‌కు సైతం విసిరారు. ఇక గురువారం చిరంజీవి తార‌క్ స‌వాల్ స్వీక‌రించి ఇంట్లో తాను చేసిన ప‌నుల వీడియోను ట్విట్ట‌ర్ అక్కౌంట్‌లో పోస్ట్ చేశారు.

 

గ‌దిని క్లీన్ చేసిన ఎన్టీఆర్ ఆ త‌ర్వాత దోసెలు వేసి... త‌ల్లి కొస‌రి కొస‌రి తినిపిస్తుంటే తిన్నారు. ఇక వీడియోలో చిరు దోసె వేసే విధానం ఆయన అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది. ఈ క్ర‌మంలోనే చిరు తార‌క్ ఈ ప‌నులు త‌న‌కు డైలీ అల‌వాటే అయితే ఈ రోజు మీ సాక్ష్యం కోస‌మే ఈ వీడియోలు అని పెట్టారు. ఈ సవాల్‌ని ఆయన సూపర్ స్టార్ రజనీకాంత్, లెజండరీ దర్శకుడు మణిరత్నం, మంత్రి కేటీఆర్ లకు విసిరారు. 

 

చిరు వీడియో చూసిన ఎన్టీఆర్ మీరు సూప‌ర్ సార్ అని రిప్లే ఇచ్చాడు. దీంతో వీరి చాటింగ్ చూస్తోన్న మెగా, ఎన్టీఆర్ ఫ్యాన్స్ వావ్‌, సూప‌ర్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: