కట్టప్ప అవతారం ఎత్తిన లెజండరీ క్రికెటర్..!
లాక్డౌన్ కారణంగా ఇళ్లకే పరిమితమైన నటీనటులు, క్రీడాకారులు నిత్యం సోషల్ మీడియాలో మాత్రం అభిమానులను అలరిస్తూనే ఉన్నారు. పలువురు ఇంటిపనులు చేసిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. మరికొందరు కరోనా వైరప్‌పై ప్రజలకు అవగాహన కల్పిచేలా వీడియోలను పోస్టు చేస్తున్నారు. పలుమార్లు సరదాసరదా వీడియోలు చేస్తూ వాటిని పోస్ట్ చేస్తున్నారు. ఈక్రమంలో తమను తాము కొత్తకొత్త లుక్స్‌లో చూసుకునేందుకు రకరకాల హేర్‌స్టైల్స్ ట్రై చేస్తే ఆ ఫోటోలను షేర్ చేస్తున్నారు.
ఇక తాజా విషయం ఏమిటంటే.. కపిల్ దేవ్.. భారత్‌కు తొలిసారి ప్రపంచ క్రికెట్ కప్‌ను అందించిన హీరో..! కపిల్‌దేవ్ కూడా కొత్తలుక్ కోసం ట్రై చేశారు. బట్టతలతో బ్లాక్ సూట్, సన్‌గ్లాసెస్ ధరించి సరికొత్తలుక్‌లో కనిపించాడు. ఆయన అచ్చం బాహుబలి సినిమాలోని కట్టప్ప(సత్యరాజ్)లా ఉన్నాడంటూ అందరూ తెగ పొగిడేస్తున్నారు. నగరంలోకి కొత్త కట్టప్పవచ్చాడంటూ లైక్‌లు కొడుతున్నారు. ఇప్పుడు ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా.. కపిల్ దేవ్ జీవితచరిత్ర ఆధారంగా రూపొందుతున్న 83 సినిమా తర్వలోనే థియేటర్లలో అలరించనుంది.
Check out Kapil Dev's new look during the lockdown! 😎 pic.twitter.com/wNKvP66Mab — Circle of cricket (@circleofcricket) April 20, 2020