దారుణం.. కరోనా పేషెంట్లను తరలిస్తున్న అంబులెన్స్ పై రాళ్లదాడి !

Edari Rama Krishna

ఓ వైపు దేశంలో కరోనా రోజు రోజుకీ విస్తరిస్తుందని.. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు లాక్ డౌన్ చేస్తున్న విషయం తెలిసిందే. కొంత మంది లాక్ డౌన్ విషయంలో ఉల్లంఘనకు పాల్పపడుతున్నారు.. మరికొంత మంది అసహనంతో ఏం చేస్తున్నారో వారికే అర్థం కాని పరిస్థితి.  ఇక మందు బాబుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే కరోనా వ్యాధి లక్షణలు ఉన్నవారు.. క్వారంటైన్ లో ఉంచుతున్న విషయం తెలిసిందే. ఆస్థాయి ఎక్కువ ఉన్నవారని ఐసోలేషన్ వార్డుకి తరలిస్తున్నారు.  కొంత మంది కరోనా పేషెంట్లు తీవ్ర అసహనానికి లోను కావడం డాక్టర్లపై చేయి చేసుకోవడం జరుగుతుంది.

 

తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో కోవిడ్ పేషెంట్లతో వెళ్తున్న అంబులెన్స్‌పై కొందరు అల్లరిమూక రాళ్ల దాడికి పాల్పడింది. ఈ దాడిలో ఇద్దరు వైద్య సిబ్బంది, పోలీసులు గాయపడ్డారు. ఒక ఇంటి నుంచి కోవిడ్ పేషెంట్లను 108 వ్యానులో తీసుకువెళ్తుండగా, రెండు పోలీసు వాహనాలు ఆ అంబులెన్స్‌ను అనుసరించాయి. పోలీసులు, వైద్య సిబ్బంది గాయపడ్డారు.

 

దీంతో హుటాహుటిన అదనపు పోలీసు బలగాలు అక్కడకు చేరుకుని ఆ ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకున్నాయి. లాక్ డౌన్ మొదలు పెట్టినప్పటి నుంచి కొంత మంది అల్లరిముఖలు ఇలాంటి దాడులకు పాల్పపడుతున్నారు. కాగా,  తాము పేషెంటును అంబులెన్స్‌లో ఎక్కిస్తుండగా, ఒక గుంపు హఠాత్తుగా తమపై రాళ్ల దాడి జరిపిందని, ఈ దాడిలో డాక్టర్లతో పాటు తాము కూడా గాయపడ్డామని అంబులెన్స్ డ్రైవరు తెలిపాడు. 

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: