క‌రోనా పై యుద్ధం: ప్రపంచంలోనే అతి చిన్న మహిళ ఏం చేస్తుందో తెలుసా..?

Kaumudhi

ఆమె ప్రపంచంలోనే అతి చిన్న. పేరు మహిళ జ్యోతి అమ్గే. ఉండేది మ‌హారాష్ట్ర‌లో. అయితే.. ప్ర‌పంచాన్ని కుదిపేస్తున్న కరోనాపై పోరుకు ఆమె కూడా రంగంలోకి దిగారు. కోవిడ్‌ 19 వ్యాప్తి నిరోధానికి తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌ల‌పై అవ‌గాహ‌న క‌ల్పించేందుకు ముందుకు వ‌చ్చారు. నాగ్‌పూర్‌లో పోలీసుల సహకారంతో ఈ అవ‌గాహ‌న‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. అయితే.. అతి చిన్నగా ఉన్న ఆమె మాట్లాడుతుంటే స్థానికులు ఎంతో ఆస‌క్తిగా విన్నారు. ప్ర‌జ‌లు సామాజిక దూరం పాటించాల‌ని, లాక్‌డౌన్ నిబంధ‌న‌ల‌ను పాటించాల‌ని, ఎట్టి ప‌రిస్థితుల్లో ఇళ్ల నుంచి బ‌య‌ట‌కు రావొద్దంటూ ఆమె అవ‌గాహ‌న క‌ల్పించారు.

 

ఇవ‌న్నీ పాటించిన‌ప్పుడే క‌రోనా మ‌హ‌మ్మారిని మ‌నం త‌రిమికొట్టగ‌ల‌మ‌ని ఆమె అన్నారు.అంతేగాకుండా.. క‌రోనా వైర‌స్ బారిన‌ప‌డితే.. కుటుంబంలో ఏర్ప‌డే స‌మ‌స్య‌ల‌ను ఆమె వివ‌రించారు. ఇదిలా ఉండ‌గా.. మ‌హారాష్ట్ర‌లో క‌రోనా వైర‌స్ రెచ్చిపోతోంది. దేశంలోనే ఈ రాష్ట్రం మొద‌టి స్థానంలో ఉంది. సుమారు రెండువేల‌కు పైగా పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. ఇక దేశ వాణిజ్య రాధానికి ముంబైలోనూ క‌రోనా తీవ్ర ప్ర‌భావం చూపుతోంది. అత్య‌ధిక కేసులు ఇక్క‌డేన‌మోదు అవుతున్నాయి. ఈ నేప‌థ్యంలో ప్ర‌జ‌ల‌కు అవ‌గాహ‌న క‌ల్పించేందుకు సెల‌బ్రిటీలు కూడా ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: