
మా నానన్న ఫోకస్ పెడితే ఇట్లానే ఉంటుందంటున్న అభిమానులు... !
ఏపీ మంత్రి కొడాలి నాని ప్రెస్‌మీట్ పెడితే అటు మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబుకు , ఇటు కృష్ణా జిల్లాకు చెందిన మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు పూం పుహారే అయిపోతుంది. నాని మాటల దాడి మొదలైందంటే చంద్రబాబు, ఉమా చెవులు చిల్లలు పడేలా విమర్శలు, బాణాలు సంధిస్తుంటారు. తాజాగా దేవినేని ఉమా జగన్ జనాల్లోకి రావాలని... ఏపీలో ప్రభుత్వం కరోనా కట్టడిలో విఫలమైందని విమర్శలు చేశారు. ఈ విమర్శలపై సోమవారం సాయంత్రం కొడాలి నాని ప్రెస్‌మీట్ పెట్టి ఏకిపడేశారు.
వాస్తవానికి కరోనా వైరస్ హడావిడి ప్రారంభమైన వెంటనే నాని ఎక్కువుగా మీడియా ముందుకు రాకుండా తన నియోజకవర్గం అయిన గుడివాడపైనే తన దృష్టంతా కేంద్రీకరించారు. దీనిపై కొందరు అనేక అనుమానాలు వ్యక్తం చేయగా... బాబోరి బ్యాచ్ అయితే నానిని జగన్ పక్కన పెట్టేశాడని విమర్శలు చేశారు. ఇక తాజా ప్రెస్‌మీట్లో నాని అటు చంద్రబాబు, ఇటు ఉమా దుమ్ము దులిపేయడంతో పాటు వీళ్లిద్దరు వినలేక చెవులు మూసుకునేంతగా విమర్శించారు.
ఇక నిమ్మగడ్డ రమేష్ వ్యవహారంపై స్పందిస్తూ వ్యవస్థలు బాగుపడాలంటే నిమ్మగడ్డ రమేష్ లాంటివారిని తీసిపడేయాలి అని.. తాము ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకే కనగరాజ్‌ను ఎన్నికల అధికారిగా నియమించామని చెప్పారు. ఇతర రాష్ట్రానికి చెందిన వ్యక్తిని ఎన్నికల అధికారిగా నియమించినా కూడా ఆయన ఏసుప్రభు భక్తుడు, జగన్‌కు బంధువు అని బాబోరి బ్యాచ్ నీచమైన విమర్శలు చేస్తోందని నాని మండిపడ్డారు. ఇక ఎమ్మెల్యే కావడం కోసం సొంత వదినను చంపిన చరిత్ర దేవినేని ఉమాది అని నాని దుయ్యబట్టారు.
ప్రజల కోసం నిర్ణయాలు తీసుకునే ప్రభుత్వం మాది అని... గత ఐదేళ్లు చంద్రబాబు చేసింది ప్రచార ఆర్భాటమే తప్పా రాష్ట్రానికి చేసిందేమి లేదని విమర్శించారు. ఏదేమైనా నాని పదునైన మాటల తూటాలతో ఆయన అభిమానులు ఫుల్లుగా ఎంజాయ్ చేసుకుంటూ ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. నానన్న ఫోకస్ పెడితే ఎలా ఉంటుందో ఇదే అని చెపుతున్నారు.