బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ డిసెంబర్ 27న మరో సంవత్సరం పెద్ద వాడయ్యాడు. ఆయన గురించి ఇండస్ట్రీలో ఎన్నో వివాదాలు, కథలు ఉన్నాయి. ఇక సినిమా పరిశ్రమలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్‌లో సల్మాన్ ప్రస్తావనే ముందుకు వస్తుంది. ఏడాది గడిచే కొద్దీ అతని ఆకర్షణ పెరుగుతుండడంతో, దేశం మొత్తం అతని పెళ్లి కోసం ఇంకా ఎదురు చూస్తున్నట్లు కనిపిస్తోంది.దాదాపు 57 ఏళ్ళ ఈ స్టార్ ఇంకా పెళ్లి చేసుకుంటాడని అనుకోవట్లేదు బాలీవుడ్ ప్రేక్షకులు. మన దేశంలో అత్యంత చర్చనీయాంశమైన అంశాలలో సల్మాన్ వివాహం కూడా ఒకటి. సల్మాన్ కు కూడా ఈ ప్రశ్న ఎన్నోసార్లు ఎదురైంది. అయితే సల్మాన్ పెళ్లి చేసుకోక పోవడానికి స్టార్ హీరోయిన్ ఐశ్వర్యారాయ్ అని కొందరు అనుకుంటారు. ఎందుకంటే అప్పట్లో వారి ప్రేమాయణం వేరే లెవెల్లో జరిగిందిలెండి. కానీ సల్మాన్ మాత్రం పెళ్లి ప్రస్తావన వచ్చినప్పుడు ఓసారి ఓ సీనియర్ హీరోయిన్ తాను ఇలా సింగిల్ గా మిగిలిపోవడానికి కారణమని చెప్పాడు.
సల్మాన్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 8 కోసం షూట్ చేస్తున్నప్పుడు ప్రముఖ తార రేఖ ఈషోను ప్రమోట్ చేయడానికి షోను అలంకరించింది. ఆ ఎపిసోడ్ లో సల్మాన్ తన జీవితంలోని ఒక ప్రత్యేక సంఘటనను పంచుకున్నాడు. ఆయన యుక్త వయసులో ఉన్నప్పుడు ఆమె అందానికి పూర్తిగా విస్మయానికి గురయ్యానని వెల్లడించాడు. అది ముంబైలోని బ్యాండ్‌స్టాండ్‌లో వారిద్దరూ ఇరుగుపొరుగుగా ఉన్న సమయంలో జరిగిందట... సల్మాన్ పారాపెట్ మీద పడుకుని, ఉదయం 5.30 గంటలకు నిద్రలేచి, రేఖ తన మార్నింగ్ వాకింగ్ కి వెళ్లడం చూసేవాడు. ఆ తర్వాత ఆమె యోగా తరగతుల్లో కూడా చేరాడట. "నేను పెద్దయ్యాక ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను" అని ఇంట్లో అందరితో చెప్పేశాడట. ఈ విషయాన్నీ సల్మాన్ సరదాగానే చెప్పినా ఇద్దరూ ఒంటరిగానే మిగిలిపోయారు.
మరింత సమాచారం తెలుసుకోండి: