వావ్... ఈ 'మేజర్' ఫ్యామిలీ మ్యాన్... బర్త్ డే సెలెబ్రేషన్స్ ఇలాగేనట !

Vimalatha
ఈరోజు అడివి శేష్ 36వ పుట్టిన రోజు. ఆయన దర్శకుడిగా అరంగేట్రం చేసినప్పటికీ నటుడిగా, రచయితగా టాలీవుడ్ లో మంచి మార్కులు కొట్టేశాడు. ఈ ప్రముఖ నటుడు తన ప్రత్యేక రోజును ఎలా జరుపుకోవాలని ప్లాన్ చేస్తున్నాడో చెప్పాడు. పంజా, లేడీస్ & జెంటిల్‌మెన్, దొంగాట, క్షణం, అమీ తుమీ, గూడాచారి, ఎవరు వంటి తెలుగు సస్పెన్స్ చిత్రాలలో తన నటనతో మంచి గుర్తింపు పొందిన అడివి శేష్ ఈరోజు తన 36వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. 2022 ఫిబ్రవరి 11న పెద్ద స్క్రీన్‌లలో విడుదల కానున్న బహుభాషా చిత్రం 'మేజర్‌'తో అడివి శేష్ తన హిందీ అరంగేట్రం కోసం సిద్ధంగా ఉన్నాడు. ఈ చిత్రం 2008 ముంబై దాడుల అమరవీరుడు మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ బయోపిక్.
శేష్ తన పుట్టిన రోజు ప్రణాళికల గురించి ఇటీవల ఓ మీడియాతో మాట్లాడుతూ “ప్రజలు సెలెబ్రిటీల పుట్టిన రోజుల గురించి మాట్లాడినప్పుడు వారు పార్టీకి ఎలా వెళ్తున్నారో లేదా మతపరమైన యాత్రకు ఎలా వెళ్తున్నారో చెబుతారు, ఆలోచిస్తారు. కానీ నా పుట్టిన రోజున నేను మా అమ్మ, నాన్నతో కలిసి భోజనం చేయడానికి ఎదురు చూస్తున్నాను. గత చాలా సంవత్సరాలుగా వారు స్టేట్స్ (యుఎస్)లో ఉన్నందున, మధ్యలో ఉన్న మహమ్మారి కారణంగా నేను వారితో కలిసి నా పుట్టిన రోజు జరుపుకోలేకపోయాను. కాబట్టి వారితో బర్త్ డే సెలెబ్రేషన్స్ జరుపుకోగలగడం అంటే నాకు చాలా ఇష్టం" అని చెప్పుకొచ్చాడు. దీంతో ఈ మేజర్ కాస్తా ఫ్యామిలీ మ్యాన్ అయిపోయాడు ప్రేక్షకుల దృష్టిలో.  
ఇక శేష్ 'మేజర్‌'తో పాటు 'HIT 2: ది సెకండ్ కేస్', 'గూడాచారి 2'లో కూడా కనిపిస్తారు. 'మేజర్' తర్వాత శేష్ మరో రెండు పాన్-ఇండియా చిత్రాలతో ప్రేక్షకులను సర్ప్రైజ్ చేయబోతున్నాడు. ఒకటి స్పై థ్రిల్లర్ అయితే, మరొకటి ఆస్కార్ విన్నింగ్ చిత్రానికి అధికారిక రీమేక్. ఇటీవల అడివి 'మేజర్' సందీప్ ఉన్నికృష్ణన్ తల్లి నుండి ఒక బహుమతిని అందుకోవడం విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: