90లలోనే ట్రాన్స్పరెంట్ శారీలో శిల్పా శిరోద్కర్ సంచలనం

Vimalatha
ఈరోజు 90ల నాటి ప్రముఖ నటి శిల్పా శిరోద్కర్ పుట్టినరోజు. బాలీవుడ్ నటి అయిన శిల్పా శిరోద్కర్ 90వ దశకంలో ప్రముఖ నటిగా హవా సాగించింది. ఎన్నో సూపర్‌ హిట్ చిత్రాలలో నటించించింది శిల్పా. అయితే ప్రస్తుతం ఆమె సీనియర్ నటిగా, టీవీ సీరియల్స్‌లో తల్లి పాత్రలు పోషిస్తోంది. నటి కేవలం 20 సంవత్సరాల వయస్సులో తన సినిమా కెరీర్ ను ప్రారంభించింది. శిల్పా తల్లి గంగూ బాయి, అమ్మమ్మ మీనాక్షి శిరోద్కర్ కూడా నటీమణులే కావడం విశేషం. శిల్పా 1983లో రమేష్ సిప్పీ తీసిన 'భ్రష్టాచార్' సినిమాతో కెరీర్‌ని ప్రారంభించింది. ఇందులో నటి మిథున్ చక్రవర్తి సరసన నటించింది. 1990లో వచ్చిన 'కిషన్ కన్హయ్య' సినిమాతో అతని కెరీర్‌కు గుర్తింపు వచ్చింది. ఈ సినిమాలో ఓ పాటలో నటి పారదర్శకమైన చీర కట్టుకుంది.
ఆమె బోల్డ్ లుక్స్ అప్పట్లో సంచలనం సృష్టించాయి. శిల్పా త్రినేత్ర, హమ్, బేవఫా సనమ్, ఖుదా గవా, గోపీ కిషన్, పెహచాన్ వంటి చిత్రాలలో నటించి ప్రేక్షకులను అలరించారు. నటి మిథున్ చక్రవర్తితో తన కెరీర్‌లో 9 సినిమాలు చేసింది. కెరీర్ మంచి ఫామ్ లో ఉన్నప్పుడే శిల్పా శిరోద్కర్ యూకే ఆధారిత బ్యాంకర్ అపరేష్ రంజిత్‌ను వివాహం చేసుకుంది. 13 సంవత్సరాల తర్వాత తిరిగి సినిమాల్లో నటించింది. శిల్పా ఏక్ ముతి ఆస్మాన్, సిల్సిలా ప్యార్ కా, సావిత్రి దేవి కాలేజ్ అండ్ హాస్పిటల్ వంటి సీరియల్స్‌లో నటించి బుల్లితెర ప్రేక్షకులలోనూ విశేషంగా అభిమానులను సంపాదించుకున్నారు.
ఇక ఆసక్తిని కలిగించే మరో విషయం ఏమిటంటే... శిరోద్కర్ అనగానే టాలీవుడ్ సూపర్ స్టార్ భార్య నమ్రత శిరోద్కర్ గుర్తొస్తుంది. అలా అందరూ అనుకుంటున్నట్టుగానే నమ్రతా శిరోద్కర్‌కి శిల్పా అక్క. తల్లిదండ్రులు వెళ్లిపోయిన తర్వాత నమ్రత నా కుటుంబం అని ఓ ఇంటర్వ్యూలో నటి చెప్పింది. ప్రపంచానికి మహేశ్‌ బాబు సూపర్‌ స్టార్‌ అయినప్పటికీ నాకు ఆయన బావ. కొన్నిసార్లు నా సోదరి కంటే అతను నన్ను ఎక్కువగా సపోర్ట్ చేస్తాడు. ఒక్క మాటలో చెప్పాలంటే నా కుటుంబం అంటూ చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: