బర్త్ డే : షారుఖ్, సన్నీ డియోల్ వైరం... 16 ఏళ్ళు మాటల్లేవ్, మాట్లాడుకోడల్లేవ్ !
'డర్' సినిమా సమయంలో తన పాత్రను చిత్రీకరించిన విధానం, షారుఖ్ ఖాన్ పాత్ర రాహుల్ మెహ్రా పాత్రకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడంతో కోపం వచ్చిందని ఆయన చెప్పాడు. ఆ చిత్ర దర్శకుడు యశ్ చోప్రాతో తన అసంతృప్తిని తెలియజేయడానికి 'డర్' సినిమా సెట్స్‌కి వెళ్లినన్నీ రోజులు చాలా కోపంగా ఉన్నాడట. ఈ సినిమా క్లైమాక్స్ సన్నివేశానికి తాను ఏమాత్రం అంగీకరించలేదని సన్నీ డియోల్ వెల్లడించాడు. సన్నీ డియోల్ మాట్లాడుతూ 'ఆ సన్నివేశం గురించి నేను యష్ చోప్రాతో వాగ్వాదానికి దిగాను. నేను సినిమాలో కమాండో అధికారిని. కాబట్టి ఈ వ్యక్తి నన్ను సులభంగా ఎలా ఓడించగలడు? నేను అతనిని చూడకపోతే అతను నన్ను ఓడించగలడు. నన్ను చూస్తూ పొడిచి చంపగలిగితే నన్ను కమాండో అని పిలుస్తారు ? అని ప్రశ్నించాను. కానీ ఈ విషయాలకు యష్ చోప్రా ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వలేదు. అతను కోరుకున్నది చేశాడు" అని చెప్పుకొచ్చాడు. ఇది సన్నీ డియోల్‌కి చాలా కోపం తెప్పించిం. ఆ కోపంలో ఆయన తన ప్యాంటును చించేసుకున్నాడట. సినిమా విడుదలై సూపర్ హిట్. కానీ చిత్రం విడుదలైన తర్వాత సన్నీ డియోల్ షారుఖ్‌తో 16 సంవత్సరాలు మాట్లాడలేదు. షారుక్ సన్నీ డియోల్‌తో మాట్లాడలేదు.