బుట్టబొమ్మకు పుట్టినరోజు శుభకాంక్షలు

Vimalatha
ఈ రోజు బుట్ట బొమ్మ పూజా హెగ్డే పుట్టిన రోజు. 1990 అక్టోబర్ 13న ఈ ముద్దుగుమ్మ పుట్టింది. పూజ తల్లి లతా హెగ్డే, ఆమె తండ్రి మంజునాథ్ హెగ్డే. వీరిది కర్ణాటకలోని మంగళూరు కానీ పూజా హెగ్డే మాత్రం ముంబై లో పుట్టి పెరిగింది. ఆమె మాతృభాష తుళు. అయితే పూజా హెగ్డే మాతృభాషతో పాటు కన్నడ, హిందీ, ఇంగ్లీష్ భాషలోల్లో మాట్లాడగలరు. ఆమె కాలేజీ చదువుతున్న రోజుల్లోనే తన తల్లి నిర్వహిస్తున్న నెట్వర్క్ మానిటరింగ్ వ్యాపార వ్యవహారాలు చూసుకోవడానికి హెల్ప్ చేస్తూ ఉండేది. దాంతో ఈ పూజకు నెట్వర్కింగ్ లో నైపుణ్యం అబ్బింది. ఇక అదే సమయంలో ఆమె ఇంటర్ కాలేజీ ఫ్యాషన్ పోటీల్లో, డాన్స్ పోటీ లో పాల్గొనేది. అలా నెమ్మదిగా ఫ్యాషన్ రంగంలోకి అడుగు పెట్టిన పూజ 2010లో విశ్వసుందరి పోటీలకు భారతదేశం నుంచి ఎంపికైన అందాల భామల్లో ఒకరు. ఆ పోటీలో పూజా హెగ్డే రెండో స్థానాన్ని కైవసం చేసుకుంది.
ఈ పోటీల తర్వాత అంటే 2012లో పూజా హెగ్డే తమిళ ఇండస్ట్రీ ఆహ్వానించింది. ఆమె చేసిన 'ముగమూడి' అనే సినిమా సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత పూజ హెగ్డేపై తెలుగు మేకర్స్ దృష్టి పడింది. 2014లో ముకుంద చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన ఈ బ్యూటీ ఆ వెంటనే ఒక లైలా కోసం అనే సినిమాలో అవకాశం కొట్టేసింది. ఈ రెండు సినిమాలు పర్లేదు అనిపించాయి. ఇక అదే జోష్ లో 2016లో బాలీవుడ్ ఇండస్ట్రీకి వెళ్ళింది. మొదటి సినిమాలోనే హృతిక్ రోషన్ సరసన అవకాశం వచ్చింది. అశుతోష్ గోవారికర్ దర్శకత్వంలో రూపొందిన ఆమె మొదటి చిత్రం 'మొహంజోదారో' దారుణంగా ఫ్లాప్ అవ్వడం పూజకు చేదు అనుభవం అని చెప్పవచ్చు. ఆ సమయంలో  పూజలు తెలుగు ఇండస్ట్రీ తన ఒడికి చేర్చుకుంది. అల్లు అర్జున్ చేసిన దువ్వాడ జగన్నాథం, రంగస్థలం, అరవింద సమేత, మహర్షి, గద్దలకొండ గణేష్, అలా వైకుంఠపురం లో వంటి చిత్రాలతో వరుస విజయాలను తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం బ్యూటీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, ఆచార్య, బీస్ట్ తెలుగు తమిళ చిత్రాలతో బిజీగా ఉంది. ఓవైపు హిందీలోనూ రాణిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: