అభినయంతో అభిమానుల మనసు కొల్లగొట్టిన సంఘవి
ఇప్పటికే తమిళ చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక పేరు సంపాదించుకున్న ఆమె తరువాత కన్నడ చిత్ర పరిశ్రమ నుండి కూడా ఆఫర్లను పొందడం ప్రారంభించింది. 1994 లో 'రాయర మగా' చిత్రం ద్వారా ఆమె కన్నడ చిత్ర రంగ ప్రవేశం చేసింది. అదే సంవత్సరం ఆమె 'జేమ్స్ జోసెఫ్ గెలీలియో' ద్వారా మలయాళ చిత్రరంగ ప్రవేశం చేసింది. మరుసటి సంవత్సరం సంఘవి తన తెలుగు చలనచిత్ర అరంగేట్రం చేసింది. తద్వారా అన్ని దక్షిణ భారత భాషా చిత్రాలలో పని చేసిన అతికొద్ది మంది తారలలో ఒకరిగా మారింది.
స్వల్ప వ్యవధిలోనే ఆమె తమిళ, తెలుగు చిత్రాలలో పనిచేస్తూ దక్షిణ భారత చిత్ర పరిశ్రమలో సూపర్‌స్టార్‌గా మారింది. ఆమె 1998 లో హిందీ చిత్రం 'షేర్-ఇ-హిందుస్థాన్' ద్వారా బాలీవుడ్‌లోకి అరంగ్రేటం చేసింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యింది. సంఘవికి పెద్దగా గుర్తింపు రాలేదు. 1998 లో విడుదలైన బాలీవుడ్ చిత్రం 'జుల్మ్-ఓ-సీతమ్'తో మరోసారి ఆమె తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. అయినప్పటికీ పెద్దగా ఫలితం లేకపోవడంతో మళ్ళీ అటువైపు చూడలేదు. చిరంజీవి, నాగార్జున, రవితేజ వంటి స్టార్ హీరోలతో సినిమాలు చేసిన సంఘవి చివరిగా 2008లో విడుదలైన కన్నడ చిత్రం 'ఇంద్ర'లో కనిపించింది.