బర్త్ డే : నడుము చూసినా చూడకపోయినా... ఆ అమాయకత్వానికే ఫిదా !
భూమిక 21 ఆగస్టు 1978 న ఢిల్లీలోని పంజాబీ కుటుంబంలో జన్మించింది. ఆమె తండ్రి ఆర్మీ ఆఫీసర్. భూమిక ప్రాథమిక విద్య ఢిల్లీలోనే సాగింది. ఆమెకు చిన్నప్పటి నుంచి నటన అంటే ఇష్టం. 1997లో ముంబైలో మోడలింగ్‌తో భూమిక తన కెరీర్‌ను ప్రారంభించింది. ఆ తర్వాత కొన్ని యాడ్ ఫిల్మ్‌లు, హిందీ మ్యూజిక్ వీడియో ఆల్బమ్‌లతో తన కెరీర్‌ను ప్రారంభించింది. ఆమె జీ టీవీ సిరీస్ "హిప్ హిప్ హుర్రే", "స్టార్ బెస్ట్ సెల్లర్స్ - ఫుర్‌సత్ మెయిన్"లో కనిపించింది. 2000 సంవత్సరంలో తెలుగు సినిమా "యువకుడు"తో సినీరంగ ప్రవేశం చేసింది. అప్పటి నుండి ఆమె తెలుగు, హిందీ, తమిళ చిత్రాలలో50కి పైగా చిత్రాల్లో నటించింది. ఆమె అందానికి, అభినయానికి ప్రత్యేకంగా ఫ్యామిలీ ఆడియన్స్ ఉన్నారు.
ఖుషి (2001), ఒక్కడు (2003), తేరే నామ్ (2003), మిస్సమ్మ (2003), సిల్లును ఒరు కాదల్ (2006), గాంధీ, మై ఫాదర్ (2007), అనసూయ (2007) వంటి చిత్రాలతో ఆకట్టుకుంది. సౌత్ లో అయితే స్టార్ హీరోలు అందరితో జత కట్టేసింది. సినిమాల్లో ఉత్తమ నటనకు ఆమెను నాలుగు నంది అవార్డులు, ఒక ఫిల్మ్‌ఫేర్ అవార్డ్ సౌత్, ఒక సైమా అవార్డు, ఒక జీ సినీ అవార్డు, జీ అప్సర అవార్డు వరించాయి.
భూమిక తన యోగా టీచర్ భరత్ ఠాకూర్‌ను 2007 లో వివాహం చేసుకుంది. వివాహానికి ముందు, ఇద్దరూ ఒకరినొకరు నాలుగు సంవత్సరాలు డేటింగ్ చలో ఉన్నారు. వారికి ఒక కుమారుడు ఉన్నాడు. 2014 సంవత్సరం తరువాత ఆమె చాలా తక్కువ చిత్రాలలో కనిపించింది. బడ్డీ (2013) చిత్రంతో రి ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత ఎంఎస్ ధోని : ది అన్టోల్డ్ స్టోరీ (2016), ఎంసిఏ (2017), యూ టర్న్ (2018) చిత్రాల్లో కీలకపాత్రల్లో నటించింది.
ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ఎవర్ గ్రీన్ హీరోయిన్ భూమికకు "ఇండియా హెరాల్డ్" తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు.