హెరాల్డ్ బర్త్ డే : 07-06-2020 రోజున జన్మించిన ప్రముఖులు..?

praveen

జూన్ 7వ తేదీన ఒకసారి చరిత్రలో కి వెళ్లి చూస్తే  ఎంతో మంది ప్రముఖులు జననాలు  జరిగాయి. మరి  ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్లి నేడు ఏం జరిగిందో తెలుసుకుందాం రండి.  

 

 రాయపాటి సాంబశివరావు జననం : భారత పార్లమెంట్ సభ్యుడు అయిన రాయపాటి సాంబశివరావు 1943 జూన్ 5వ తేదీన జన్మించారు. వఈయన భారత రాజకీయాలలో క్రియాశీలకంగా వ్యవహరించారు. భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఉన్న రాయపాటి సాంబశివరావు రాజకీయాలు ఎన్నో పదవులను అలంకరించారు. ముఖ్యంగా వరుసగా 11వ 12వ 14వ లోక్సభ లకు గుంటూరు లోక్సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మూడుసార్లు ఎన్నికయ్యారు. లోక్సభలో కూడా వివిధ సమస్యలపై ఆయన గళం వినిపించారు. ఆంధ్ర రాజకీయాలలో ఎంతో కీలకంగా వ్యవహరించిన రాయపాటి సాంబశివరావు... రాజకీయాల్లో ఎంతో  ప్రజాదరణ ఉన్న నేత గా ఎదిగారు. 

 

 మహేష్ భూపతి జననం : భారత దేశానికి చెందిన ప్రముఖ టెన్నిస్ క్రీడాకారుడు అయిన మహేష్ బాబు  1974 జూన్ 7వ తేదీన జన్మించారు. చైనా లో జన్మించిన మహేష్ భూపతి భారత దేశానికి చెందిన టెన్నిస్ క్రీడాకారులు. టెన్నిస్ క్రీడలో భారతదేశానికి ఎంతగానో పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చిన ఆటగాడు మహేష్ భూపతి. భారత దేశానికి గ్రాండ్స్లామ్ టైటిల్స్ అందించిన  మొదటి క్రీడాకారుడు మహేష్ భూపతి . 1997లో ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ లో జపాన్ కు చెందిన ఆటగాడితో  కలిసి ఆడి మిక్స్ డ్  డబుల్స్ విజయం సాదించాడు . ఆ తర్వాత ఎన్నో విజయాలను కూడా అందుకున్నారు. 2002లో భూటాన్ లో జరిగిన 14 ఆసియా క్రీడల్లో  మన దేశానికి బంగారు పతకం కూడా సాధించి పెట్టారు మహేష్ బాబు. మొదట  గతంలో ప్రముఖ మోడల్ అయిన శ్వేత జయశంకర్ తో  వివాహమైంది. ఆ తర్వాత వీరిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో ఐదేళ్ల వివాహ జీవితం 2010 జూలైలో ముగిసింది. ఆ తర్వాత బాలీవుడ్ నటి మాజీ ప్రపంచ సుందరి అయిన లారాదత్తా పెళ్లి చేసుకున్నారు. 

 

 అమృత రావు జననం : ప్రముఖ భారతీయ చలనచిత్ర నటి అయిన అమృత రావు 1981 జూన్ 7వ తేదీన జన్మించారు. అమృత రావు తండ్రి ఒక అడ్వర్టైజింగ్ ఏజెన్సీ నలుపుతున్నారు. మొదటి నుంచి  అమృతరావు సినిమాలపై ఆసక్తి కనబరచలేదు. మొదటిసారిగా ఫేర్ ఎవర్  ఫేక్ క్రీమ్ యాడ్ లో నటించింది.  ఇక ఆ తర్వాత బాలీవుడ్లో ఒక సినిమాలో నటించేందుకు అవకాశం దక్కించుకుంది అమృత. ఇక ఆ తర్వాత అమృత రావు నటించిన ఇష్క్ విష్క్  ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఘన విజయం సాధించింది. దీంతో ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయింది అమృతరావ్. ఇక ఆ తర్వాత వరుస అవకాశాలు వచ్చి అమృతరావు చెంత వాలాయి . అమృతం బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎంతగానో గుర్తింపు సంపాదించి  ఎంతో మంది అభిమానులను కూడా సంపాదించుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: