హెరాల్డ్ బర్త్ డే : 15-05-2020 రోజున జన్మించిన ప్రముఖులు..?

praveen

15వ తేదీన ఒకసారి చరిత్రలోకి వెల్లి  చూస్తే   ఎంతో మంది ప్రముఖులు జననాలు  జరిగాయి . మరి ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్లి  నేడు  జన్మించిన ప్రముఖులు ఎవరో  తెలుసుకుందాం రండి. 

 

 సుఖ్ దేవ్ జననం : భారత స్వాతంత్ర్య సమర యోధుడు భగత్ సింగ్ రాజగురు సహచరులతో ప్రసిద్ధి చెందిన స్వతంత్ర సమరయోధుడు అయినా సుఖ్ దేవ్  1907 మే 15వ తేదీన జన్మించారు. 1928లో లాలాలజపతిరాయ్ మరణానికి కారణమైన బ్రిటిష్ ప్రభుత్వం పై పగ తీర్చుకోవడానికి ఫిరోజ్పూర్ బ్రిటిష్ పోలీస్ అధికారిని  హతమార్చినందుకు  1931లో ఉరి తీయబడ్డ ధీరుడు సుఖదేవ్. ముగ్గురు విప్లవకారులు అయినా భగత్సింగ్ రాజ్ గురూ  సుఖ్ దేవ్  లను 1931 మార్చి 23న లోహోరే  సెంట్రల్ జైలులో  సాయంకాలం ఉరితీశారు. 

 

 కిషన్ రెడ్డి జననం : భారతీయ జనతా పార్టీకి చెందిన కీలక నేత అయినా కిషన్ రెడ్డి  1964 మే 15వ తేదీన రంగారెడ్డి జిల్లా తిమ్మాపురం లో జన్మించారు. ఒక సాధారణ కార్యకర్త స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగి ఏకంగా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. 1980లో పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ కోసం సేవలందిస్తున్న కిషన్ రెడ్డి 2004 శాసనసభ ఎన్నికల్లో తొలిసారిగా హిమాయత్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. 2009లో అంబర్పేట్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికై వరుసగా రెండో పర్యాయాలు  కూడా రాష్ట్ర శాసనసభలో ప్రాతినిధ్యం వహించారు కిషన్ రెడ్డి. 2012 జనవరి 19న మహబూబ్నగర్ లోని ఓ గ్రామం  నుంచి రెండు రోజుల పాటు తెలంగాణ భారతీయ జనతాపార్టీ పోరు యాత్ర ప్రారంభించారు. 2019 సార్వత్రిక ఎన్నికలలో సికింద్రాబాదు లోకసభ నియోజకవర్గం నుంచి గెలిచిన కిషన్ రెడ్డి ప్రస్తుతం హోం శాఖ సహాయ మంత్రిగా కొనసాగుతున్నారు. 

 

 మాధురి దీక్షిత్ జననం : ప్రముఖ బాలీవుడ్ నటి అయిన మాధురిదీక్షిత్ సినీ ప్రేక్షకులందరికీ కొసమెరుపు. ఈమె 1967 మే 15వ తేదీన జన్మించారు. 1980 నుంచి దాదాపు దశాబ్దకాలం పాటు హిందీ చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా  మంచి డాన్సర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతులు పొందారు. ఎంతో మంది స్టార్ హీరోల సరసన విజయవంతమైన సినిమాల్లో నటించడమే కాదు తన నటనకు విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుని బాలీవుడ్లోనే అత్యంత ఉన్నతమైన నటిగా ఎదిగారు  మాధురి దీక్షిత్.2008 సంవత్సరంలో భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది.  

 

 

 రామ్ జనం : రామ్ పోతినేని తెలుగు ప్రేక్షకులందరికీ ఎనర్జిటిక్ స్టార్ రామ్ గా కొస  మెరుపు. రామ్ 1987 మే 15వ తేదీన జన్మించారు, ఇక రామ్ హీరోగా దేవదాసు చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యారు. మొదటి సినిమాలో ఇలియానా తో జోడి కట్టిన నటించి...మొదటి  సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్నారు. వైవియస్ చౌదరి దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2006 జనవరి 11న విడుదలై బాక్సాఫీసు వద్ద భారీ విజయాన్ని నమోదు చేసింది. మొదటి సినిమాతోనే ఉత్తమ నూతన నటుడిగా  అవార్డును అందుకున్నారు రామ్ పోతినేని. ఇక రెండవ చిత్రం సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన  జగడం సినిమాలో నటించారు. ఈ సినిమా అంతగా ప్రేక్షకాదరణ పొందక పోయినప్పటికీ విశ్లేషకుల నుండి మాత్రం ప్రశంసలు అందుకున్నాడు రామ్. ఇక ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదుగుతూ తన డాన్స్ పర్ఫార్మెన్స్ తో తన నటనతో కామెడీ టైమింగ్ తో స్టార్ హీరోగా మారిపోయాడు.  తెలుగు ప్రేక్షకుల ఎనర్జిటిక్ స్టార్ గా కొనసాగుతున్నారు రామ్ పోతినేని. 

 

 

 శిల్ప చక్రవర్తి జననం : బుల్లితెరపై యాంకర్గా ఎంతగానో గుర్తింపు తెచ్చుకున్న శిల్ప చక్రవర్తి 1985 మే 15వ తేదీన జన్మించారు. తెలుగు బుల్లితెరపై ఎన్నో కార్యక్రమాలలో యాంకర్ గా తన వాక్చాతుర్యంతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు శిల్ప చక్రవర్తి. ఇప్పటికీ కూడా పలు చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాడు. 

 

 అనసూయ భరద్వాజ్ జననం  : ప్రముఖ నటి టీవీ యాంకర్ ఆయన అనసూయ భరద్వాజ్ తెలుగు ప్రేక్షకులందరికీ కొసమెరుపు. కాగా  అనసూయ భరద్వాజ్ 1985 మే 15వ తేదీన జన్మించారు. అయితే మొదట ఈటీవీ లో ప్రసారమయ్యే జబర్దస్త్ షోలో యాంకర్ గా ఎంతో  గుర్తింపు సంపాదించారు అనసూయ. ఆ తర్వాత నటిగా  ఎన్నో సినిమాల్లో అవకాశాలు కూడా దక్కించుకొని నటన పరంగా కూడా విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ముఖ్యంగా అనసూయ నటించిన పాత్రల్లో  ఎక్కువగా ప్రేక్షకులకు గుర్తుండిపోయే పాత్ర రంగస్థలం సినిమాలో రంగమ్మత్త .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: