హెరాల్డ్ బర్త్ డే :08-04-2020 రోజున జన్మించిన ప్రముఖులు ఎవరంటే..?
ఏప్రిల్ 8 వ తేదీన ఒకసారి చరిత్రలో కి వెళ్లి చూస్తే ఎంతో మంది ప్రముఖులు జననాలు జరిగాయి. మరి ఒకసారి హిస్టరీ లోకి వెళ్లి ఈ రోజు జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి .
దాసు శ్రీరాములు జననం : ప్రసిద్ధ కవి పండితుడు అయిన దాసు శ్రీరాములు 1846 ఏప్రిల్ 8 వ తేదీన జన్మించారు. ఏలూరులో సంగీత నృత్య కళాశాల స్థాపించి ఎంతో మంది స్త్రీలకు నాట్యం నేర్పించారు దాసు శ్రీరాములు. అంతేకాకుండా తన నాట్య సంగీతంతో ఎంతోమంది అలరించారు .
కోఫీ అన్నన్ జననం : ఐక్యరాజ్య సమితి మాజీ ప్రధాన కార్యదర్శి కోఫీ అన్నన్ 1938 ఏప్రిల్ 8 వ తేదీన జన్మించారు.
అల్లు అర్జున్ జననం : తెలుగు ప్రేక్షకులందరికీ అల్లు అర్జున్ స్టైలిష్ స్టార్ గా కొసమెరుపు. అల్లు వారి వారసుడిగా మెగా మేనల్లుడి గా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన అల్లు అర్జున్ ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో టాప్ హీరోగా దూసుకుపోతున్నారు. అల్లు అర్జున్ 1983 ఏప్రిల్ 8 వ తేదీన జన్మించారు. కె.రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన గంగోత్రి సినిమా తో తెలుగు తెరకు హీరోగా పరిచయమైన అల్లు అర్జున్ అనతి కాలంలోనే స్టార్ హీరోగా మారిపోయాడు. తనదైన యాక్టింగ్ డాన్సులతో తెలుగు ప్రేక్షకులని మెస్మరైజ్ చేసి ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు అల్లుఅర్జున్.
నిత్యామీనన్ జననం : ప్రముఖ భారతీయ సినీ నటి నిత్యామీనన్ 1988 ఏప్రిల్ 8 వ తేదీన జన్మించారు. స్వతహాగా సింగర్ అయిన ఈ నటి సినిమాలో హీరోయిన్ కూడా నటించారు. ఓ వైపు తన గానంతో ఎంతోమందిని అలరిస్తూనే మరోవైపు తన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు నిత్యమీనన్.ఎలాంటి పాత్రలో ఒదిగిపోయిన నటిస్తూ ఎంతగానో క్రేజ్ సంపాదించుకున్నారు. ఎలాంటి పాత్రలోనైనా జీవించి మరి నటిస్తూ తన వైవిధ్యమైన నటనతో విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్నారు నిత్యమీనన్. ప్రస్తుతం తమిళ తెలుగు హిందీ భాషల్లో వరుస సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నది.
అక్కినేని అఖిల్ జననం : అక్కినేని వారసుడిగా తెలుగు చిత్ర పరిశ్రమకు హీరోగా పరిచయం అయిన అక్కినేని అఖిల్ ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో యువ హీరోల దూసుకుపోతున్నారు. అక్కినేని అఖిల్ 1994 ఏప్రిల్ 8 వ తేదీన జన్మించారు. అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చినప్పటికీ ఇప్పటి వరకు హిట్ సాధించలేకపోయాడు ఈ యువ హీరో. కానీ తన దైన అందంతో ఎంతోమంది అభిమానులు మాత్రం సంపాదించుకున్నాడు.