"వేసవి"...నుంచీ కాపాడే "సహజసిద్ద పానీయాలు"...???

NCR

ఎండాకాలం అంటేనే జనాలు భయంతో వణికిపోతారు. అన్ని కాలలలోకంటే కూడా వేసవి కాలానికే అందరూ భయపడిపోతారు. భూతాపం సృష్టించే ప్రకంపనలు అన్నీ ఇన్నీ కావు.ఈ కాలంలో దాహం విపరీతంగా వేస్తుంది దాంతో కూల్ డ్రింక్స్ , ఇతర శీతల పానీయాలు విపరీతంగా తాగుతూ ఉంటారు. కానీ అవి శరీరానికి ఎంతటి హాని చేస్తాయో అందరికి తెలిసిందే అయితే వేసవి వచ్చిందంటే పూర్వ కాలం నుంచీ పెద్దలు కొన్ని సహజ సిద్ద పానీయాలు తయారు చేసుకునే త్రాగే వారు.

 

 

అయితే ఈ సహజసిద్ద పానీయాలు శరీరానికి ప్రోటీన్స్ అందించడంతో పాటు, శక్తిని కూడా కలుగ చేస్తాయి. వాటిని మనం నిత్యం తీసుకోవడం ఎండ  వేడిమి నుంచీ ఎంతో ఉపసమనాన్ని ఇస్తుంది. అంతేకాదు శరీరం నల్లబడకుండా, చర్మం ఎండవేడికి కందిపోకుండా కాపాడుతాయి.  మరి ఆ సహజసిద్ద పానీయాలు ఏమిటో ఓ లుక్కేద్దమా..

    మజ్జిగ ఇది మనం రోజు భోజనంలో కలుపుకుని తీసుకుంటాం అందులో ప్రత్యేకత ఏముంటుందనే కదా. వేసవిలో మజ్జిగ తన పని తనాన్ని చూపిస్తుంది. మజ్జిగ లేదా లస్సీ తాగడం వల్ల శరీరం రీచార్జి         అవుతూ కొత్త శక్తి కలుగుతుంది. ఉత్సాహంగా ఉంటారు ఏవైనా జీర్ణ సమస్యలు ఉంటే పోతాయి. శరీరానికి చల్లదనం అందుతుంది.

    

     కొబ్బరి నీళ్ళు త్రాగడం వలన కూడా శరీరం ఎంతో చల్లగా ఉంటుంది. వేడిమి నుంచీ ఉపసమనం ఇస్తుంది. ఈ కొబ్బరి నీళ్లను త్రాగడం వలన వాటిలో ఉండే సోడియం, పొటాషియం తదితర                       మినరల్స్ మనకు అధికంగా అందుతాయి దాంతో శరీరం నుంచి నీరు బయటకు ఎక్కువగా వెళ్లకుండా కాపాడుతుంది.

      

     పుచ్చకాయ వేసవిలో మనం తాగాల్సిన లేదా తినాల్సిన ముఖ్యమైన ఫలం.  ఇందులో ఉండే అమైనో ఆమ్లాలు మనకు శక్తిని ఇవ్వడమే కాకుండా డీ హైడ్రేషన్ బారిన పడకుండా కాపాడుకుంటూ               వస్తాయి.

     


    చెరకు రసం వేసవి తాపానికి శరీరం నీరసం అయ్యిపోయిన వారు ఇది ఎక్కువగా తీసుకువడం వలన వెంటే శక్తి పొందుతారు. దీంట్లో ఉండే ఫైబర్ జీర్ణ సమస్యలను పోగొడుతుంది. శరీరానికి సరపడా శక్తి      ఇస్తుంది.

     

    నిమ్మకాయ ఉప్పు , లేదా నిమ్మకాయ పంచదార నీళ్ళు ఇవి కూడా శరీరానికి తక్షణ శక్తిని ఇవ్వడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఇందులో ఉండే విటమిన్స్ ఎండా వేడిమి నుంచీ కాపాడటంలో ప్రముఖ        పాత్ర పోషిస్తాయి. చర్మం ఎండ వేడిమికి పాడవకుండా ఈ పానీయం ఎంతో ఉపయోగ పడుతుంది.

    


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: