జుట్టుకి హెన్నా పెడుతున్నారా.. అయితే ప్రమాదంలో పడ్డట్టే?

frame జుట్టుకి హెన్నా పెడుతున్నారా.. అయితే ప్రమాదంలో పడ్డట్టే?

praveen
'హెన్నా' గురించి నేటి యువ తరానికి పరిచయం చేయాల్సిన పనిలేదు. సాధారణంగా యువతీ యువకులలో జుట్టు రాలడం అనేది ఇపుడు పెద్ద సమస్యగా మారింది. దాంతోనే హెన్నాను మార్కెట్లో మంచి డిమాండ్ ఏర్పడింది. ఎందుకంటే ఇది జుట్టుకు సహజమైన రంగు ఇచ్చే వాటిల్లో ప్రధాన పాత్ర పోషిస్తుంది. పైగా దీనిని సంప్రదాయమైన, ప్రాచీన పరిష్కారంగా ఆరోగ్య నిపుణులు చెప్పడం వలన జనాలు బాగా వాడుతున్నారు. ఇది ఎక్కువగా రసాయనాల ప్రభావం లేకుండా జుట్టు రంగును మార్చే పద్ధతిలో భాగంగా బాగా ప్రాచుర్యం పొందింది. ఇక తెల్ల జుట్టు ఉన్నవారు సహజంగా ఎరుపు రంగు కోసం హెన్నాను ఎంచుకుంటారు. ఇది తల చర్మాన్ని శీతల పరచడం, జుట్టును నిగారింపజేయడం వంటి అనేక ప్రయోజనాలు కలిగిస్తుంది.

అయితే, దీన్ని తరచూ వాడటం అంత మంచిది కాదని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. దీన్ని సమతుల్యంగా, జాగ్రత్తగా వాడితేనే మంచిదని సూచిస్తున్నారు. హెన్నాలో ఉండే టానిన్లు తల చర్మం నుండి సహజ తేమను, నూనెలను పూర్తిగా తొలగిస్తాయి. దీని వల్ల జుట్టు ఎక్కువగా బడుతుంది. పొడిబారిన జుట్టు సులభంగా విరిగిపోతుంది, చిట్లిపోతుంది. తద్వారా జుట్టు సహజ మృదుత్వం కోల్పోతుంది. ఇంకొక ప్రధాన సమస్య ఏమిటంటే? అలెర్జీ. హెన్నా సహజమైనదే అయినా కొందరికి ఇది తల చర్మంపై ప్రతికూలంగా పని చేస్తుంది.

మరీ ముఖ్యంగా సున్నితమైన స్కిన్ ఉన్నవారికి ఇది తీవ్రమైన ఇబ్బందిగా పరిణమిస్తుంది. అందుకే ప్రతి సారి హెన్నా వేయడానికి ముందు ప్యాచ్ టెస్ట్ చేయడం అవసరం అని నిపుణులు సూచిస్తున్నారు. హెన్నాను తరచూ వాడటం వల్ల జుట్టుపై స్థిరంగా ఒక రంగు పొర అనేది పేరుకుపోతుంది. దీని వల్ల రంగు అసమానంగా కూడా కనిపించే అవకాశం లేకపోలేదు. ఈ స్థితిలో జుట్టు పూర్తిగా అసహజంగా మారుతుంది. హెన్నా వాడకాన్ని పరిమితంగా ఉంచడం ద్వారా ప్రయోజనాలు వుంటాయని అంటున్నారు. నెలకు ఒకసారి లేదా అవసరమైనప్పుడు మాత్రమే వాడటం ఉత్తమం అని సూచిస్తున్నారు. హెన్నా ఒక మంచి సహజ ప్రత్యామ్నాయం అయినా దీన్ని అధికంగా వాడటం వల్ల జుట్టుకు కలిగే దుష్ప్రభావాల గురించి ఎరుక వహించాలని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: