ఈ టిప్ ట్రై చేస్తే జుట్టు వద్దన్నా ఊడిపోదు?

Purushottham Vinay
జుట్టు పొడవుగా అందంగా, ఆరోగ్యంగా ఉండాలని ఆడవాళ్లు ఎప్పుడు చాలా రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. జుట్టు పెరుగుదలకు  మందార ఆకులను ఉపయోగిస్తే చాలా మంచిది.  జుట్టు పెరుగుదలకు మనందార ఆకులను, పువ్వులను ఉపయోగిస్తూ ఉంటే చాలా ఆరోగ్యంగా కూడా ఉంటారు. మందార ఆకులను, పువ్వులను పేస్ట్ గా చేసి జుట్టు పట్టిస్తూ ఉండాలి. అలాగే నూనెలో మందార ఆకులు వేసి ఆ నూనెను జుట్టు రాస్తూ ఉన్నా మంచి ఫలితం ఉంటుంది. మందార ఆకులను వాడడం వల్ల జుట్టు కుదుళ్లు పొడిబారకుండా, జుట్టు విరిగిపోకుండా ఉంటుంది. ఈ విధంగా నాలుగు రకాలుగా మందార ఆకులు మన జుట్టు పెరుగుదలకు సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. మందార ఆకులను పేస్ట్ గా చేసి దాని నుండి రసాన్ని తీసి జుట్టుకు పట్టించాలి. దీనిని ఒక గంట పాటు అలాగే ఉంచి ఆ తరువాత తలస్నానం చేయాలి. అలాగే నూనెలో ఎండిన మందార ఆకులు వేసి మరిగించాలి. తరువాత ఈ నూనెను వడకట్టి తలకు రాసుకోవడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది.


ఈ విధంగా మందార ఆకులను వాడడం వల్ల జుట్టు పొడవుగా, నల్లగా ఆరోగ్యంగా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
మందార ఆకులను వాడడం వల్ల మెలనిన్ ఎక్కువగా తయారవుతుంది. దీంతో జుట్టు నల్లగా ఉంటుంది. ఇక జుట్టు కుదుళ్లు, తల చర్మం పొడిబారకుండా చేయడంలో కూడా మందార మనకు ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. మందార ఆకులో ఉండే ఫైటో కెమికల్స్ జుట్టు కుదుళ్లు పొడిబారకుండా కాపాడడంలో సహాయపడతాయి.మందార ఆకులను వాడడం వల్ల జుట్టు కుదుళ్లకు రక్తప్రసరణ పెరుగుతుంది. మందార ఆకుల్లో ఉండే ఐసోప్లేవనాయిడ్స్ జుట్టు కుదుళ్లకు రక్తాన్ని ఎక్కువగా సరఫరా చేస్తాయి. రక్తం ఎక్కువగా సరఫరా అవ్వడం వల్ల పోషకాలు, ఆక్సిజన్ జుట్టు కుదుళ్లకు ఎక్కువగా అందుతాయి. అలాగే జుట్టు కుదుళ్లల్లో ఉండే వ్యర్థాలు కూడా తొలగిపోతాయి. దీంతో జుట్టు కుదుళ్లు బలంగా, ధృడంగా తయారవుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: