తెల్ల జుట్టు, జుట్టు రాలే సమస్య వారంలో తగ్గే టిప్ ?

Purushottham Vinay
అసలు ఈ మధ్య కాలంలో చాలా మంది కూడా చాలా చిన్న వయస్సులోనే తెల్లజుట్టు సమస్య బారిన పడుతున్నారు. తెల్ల జుట్టు సమస్య అందరిని ఎంతగానో వేధిస్తుంది.దాంతో చాలా మంది యూత్ కూడా టెన్షన్ పడిపోయి మార్కెట్ లో దొరికే చాలా రకాల ప్రొడక్ట్స్ వాడేస్తూ ఉంటారు.దీని వలన జుట్టు రాలటం వంటి సమస్యలు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి కొన్ని ఇంటి చిట్కాలను కనుక ప్రయత్నిస్తే ఖచ్చితంగా చాలా మంచి ఫలితం ఉంటుంది.అయితే ఇప్పుడు చెప్పబోయే ఇంటి చిట్కాలను కాస్త ఓపికగా కనుక ప్రయత్నం చేస్తే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా తెల్లజుట్టును చాలా ఈజీగా మనం నల్లగా మార్చుకోవచ్చు. ఈ టిప్ కోసం మనం మొత్తం మూడు ఇంగ్రిడియన్స్ ఉపయోగిస్తున్నాం. కరివేపాకు, ఉసిరి ముక్కలు ఇంకా కొబ్బరి నూనెని ఈ టిప్ కోసం ఉపయోగిస్తున్నాం. ఉసిరి ముక్కలు  అయితే తాజా ముక్కలను ఉపయోగించండి.


ఒక గిన్నెలో కొబ్బరినూనెని తీసుకొని దానిలో కరివేపాకు ఇంకా ఎండిన ఉసిరి ముక్కలు వేసి వాటిని బాగా మరిగించాలి. ఇక మరిగిన ఈ నూనెను వడకట్టి సీసాలో స్టోర్ చేసుకోవాలి. ఈ నూనెను జుట్టుకి రాసి సున్నితంగా రెండు నిమిషాలు పాటు బాగా మసాజ్ చేయాలి.ఇంకా ఈ నూనెను మామూలు నూనె వాడినట్టుగా మీరు వాడవచ్చు. లేదా జుట్టుకి రాశాక అరగంట తర్వాత కుంకుడు కాయలతో శుభ్రంగా తలస్నానం చేయాలి. ఈ విధంగా వారంలో మీరు మూడు సార్లు కనుక చేస్తే ఖచ్చితంగా మంచి ఫలితం తప్పకుండా వస్తుంది.అయితే తెల్లజుట్టు మాత్రం ఎక్కువగా ఉంటే ఎక్కువ వారాల సమయం పడుతుంది. దీన్ని కాస్త ఓపికగా చేసుకుంటే మంచి ఫలితం వస్తుంది. జుట్టు రాలే సమస్య కూడా ఈజీగా తగ్గుతుంది.కాబట్టి ఖచ్చితంగా ఈ చిట్కా ట్రై చెయ్యండి. ఖచ్చితంగా చాలా మంచి ప్రయోజనాలని మీరు పొందుతారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: