నలుపుని పోగొట్టి ముఖాన్ని తెల్లగా మార్చే హెల్తీ టిప్?

Purushottham Vinay
ముఖం చాలా అందంగా ఇంకా తెల్లగా కనబడాలని ప్రతి ఒక్కరు కూడా ఎంతగానో కోరుకుంటారు. ముఖం అందంగా కనబడడం కోసం  ఎన్నో టిప్స్ పాటించి ఎంతో ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినప్పటికి ఫలితం లేక అనేక రకాలుగా ఇబ్బంది పడుతూ ఉంటారు.ఇక అలాంటి వారు మన ఇంట్లో ఉండే పదార్థాలతో ఒక చక్కటి టిప్ ని తయారు చేసుకుని వాడడం వల్ల ముఖం చాలా అందంగా మారుతుంది. ముఖంపై ఉండే నలుపు, మృతకణాలు ఈజీగా తొలగిపోయి ముఖం చాలా కాంతివంతంగా తయారవుతుంది. ముఖాన్ని తెల్లగా మార్చే ఆ టిప్ ఏమిటి ఇంకా దీన్ని ఎలా తయారు చేసుకోవాలి వంటి పూర్తి వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.ఈ టిప్ ని తయారు చేసుకోవడానికి  మనం కీరదోసను, శనగపిండిని, పెరుగును ఉపయోగించాల్సి ఉంటుంది. ముందుగా ఒక జార్ లో అర ముక్క కీరదోసను తీసుకొని దానిని ముక్కలుగా చేసి వేసుకోవాలి.


ఆ తరువాత ఇందులో 2 టీ స్పూన్ల శనగపిండిని ఇంకా ఒక టీ స్పూన్ పెరుగును వేసి వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఆ తరువాత ఈ మిశ్రమాన్ని మీరు ఒక గిన్నెలోకి తీసుకోవాలి.ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని ముఖానికి రాసుకునే ముందు ముఖాన్ని గోరు వెచ్చని నీటితో బాగా శుభ్రం చేసుకోవాలి. ఆ తరువాత ఈ మిశ్రమాన్ని ముఖానికి లేపనంగా రాసుకోవాలి.ఇక ఈ మిశ్రమం పూర్తిగా ఆరిన తరువాత ముఖాన్ని నీటితో బాగా శుభ్రం చేసుకోవాలి. అయితే సబ్బును ఉపయోగించకుండానే ముఖాన్ని బాగా శుభ్రం చేసుకోవాలి.ఇలా ప్రతిరోజూ ఈ టిప్ ని పాటించడం వల్ల ముఖంపై ఉండే నలుపు, ట్యాన్ ఇంకా మృతకణాలు అన్నీ చాలా ఈజీగా తొలగిపోతాయి. మీ ముఖం అందంగా, మృదువుగా ఇంకా అలాగే చాలా కాంతివంతంగా తయారవుతుంది.కాబట్టి ఖచ్చితంగా ఈ టిప్ పాటించండి. ఖచ్చితంగా తెల్లగా అందంగా అవుతారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: