రోజ్ వాటర్‌తో కేవలం అందానికే కాదు ఆరోగ్యానికి కూడా చాలా రకాలు ప్రయోజనాలు ఉన్నాయి. అందుకే కొంత మంది మందులు ఇంకా ఆహార పదార్థాలలో కూడా రోజ్ వాటర్ ని వాడతారు. మార్కెట్లో లభించే రోజ్ వాటర్‌ను ఇంట్లోనే మనం చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు.ఇక ఇది ఇప్పుడు మన ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం.రోజ్ వాటర్ అనేది క్రిమినాశక లక్షణాలను కలిగి ఉంటుంది. దీని కారణంగా గాయాలు కూడా చాలా వేగంగా నయం అవుతాయి. ఈ గులాబీ రేకుల నుంచి ఇతర మందులని తయారు చేస్తారు. వీటిని గాయాలు ఇంకా అలాగే చర్మ అలెర్జీలు లేదా ఇతర సమస్యలను నయం చేయడానికి కూడా ఉపయోగిస్తారు.ఇంకా అలాగే రోజ్ ఆయిల్ ఒత్తిడిని తగ్గించడంలో చాలా బాగా సహాయపడుతుంది. గులాబీ రేకులతో చేసిన నీళ్లతో స్నానం చేయడం వల్ల మనసుకు మంచి ప్రశాంతతతో పాటు చాలా మంచి అనుభూతి కలుగుతుంది.ఇంకా అలాగే ప్రాచీన కాలంలో భారతీయులు గులాబీ రేకుల ద్వారా కూడా మందులని తయారుచేసేవారు.
దీనికి ఆయుర్వేదంలో కూడా ఒక ప్రముఖ స్థానం ఉంది. నేటికీ స్వదేశీ మందులలో రోజ్ వాటర్ చేర్చడం ద్వారా గొంతులో వాపుని చాలా ఈజీగా తొలగించవచ్చు. దీని యాంటీ బాక్టీరియల్ ప్రభావాలు గొంతు సమస్యల నుంచి ఉపశమనం పొందడంలో చాలా బాగా సహాయపడతాయి.మన పాత రోజుల్లో కళ్లను శుభ్రం చేయడానికి రోజ్ వాటర్‌ను ఎక్కువగా ఉపయోగించేవారు. ఎందుకంటే ఇది కళ్ళలో చికాకు లేదా దురదను తొలగించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. నేటి కాలంలో కంటి సంరక్షణ ఉత్పత్తులు మార్కెట్లో చాలానే అందుబాటులో ఉన్నాయి. ఇందులో రోజ్ వాటర్ ని మాత్రం ఖచ్చితంగా వినియోగిస్తారు.చర్మానికి ఇంకా అలాగే కళ్లకు చల్లదనాన్ని ఇచ్చే రోజ్ వాటర్‌ని కూలింగ్ ఏజెంట్ అని కూడా పిలుస్తారు.చాలా పరిశోధనలలో రోజ్ ఎసెన్స్‌తో కడుపు సమస్యలను చాలా సులభంగా అధిగమించవచ్చని తేలింది. పురాతన కాలంలో అయితే గులాబీ రేకులను కడుపుని శాంతపరచడానికి ఎక్కువగా ఉపయోగించేవారు. రోజ్ వాటర్‌తో ఉబ్బరం లేదా ఇతర కడుపు సమస్యలను చాలా ఈజీగా తగ్గించవచ్చు.