చంక భాగంలో నలుపుని సింపుల్ గా పోగొట్టే టిప్?

Purushottham Vinay
కొన్ని రకాల హోమ్ టిప్స్ ఉపయోగించి మనం చాలా సులభంగా చంక భాగంలో పేరుకుపోయిన నలుపును ఈజీగా తొలగించుకోవచ్చు. చంక భాగంలో పేరుకుపోయిన నలుపును తొలగించే ఈ టిప్స్ ఏమిటి.. వీటిని ఎలా తయారు చేసుకోవాలి ఇంకా ఎలా వాడాలి వంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.ఇంకా ఈ టిప్ తయారు చేసుకోవడానికి  ముందుగా మనం ఒక గిన్నెలో 3 టీ స్పూన్ల మైదాపిండిని తీసుకోవాలి. ఆ తరువాత ఇందులో ఒక టీ స్పూన్ నిమ్మరసం, ఒక టీ స్పూన్ బంగాళాదుంప రసం, ఒక టీ స్పూన్ పెరుగు, ఒక టీ స్పూన్ తేనె ఇంకా అలాగే అర టీ స్పూన్ వంటసోడా వేసి కలపాలి. ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని చంక భాగంలో చర్మంపై రాసి బాగా మర్దనా చేసుకోవాలి. ఇక అది ఆరిన తరువాత నీటితో బాగా శుభ్రం చేసుకోవాలి. దీనికి వంటసోడా ఉపయోగిస్తే ఈ టిప్ ని వారానికి ఒకసారి మాత్రమే ఉపయోగించాలి. అదే వంటసోడా ఉపయోగించకపోతే ఈ టిప్ ని వారానికి మూడు నుండి నాలుగు సార్లు ఉపయోగించవచ్చు.


ఈ విధంగా ఈ టిప్ ని ఉపయోగించడం వల్ల చంక భాగంలో పేరుకుపోయిన నలుపు చాలా ఈజీగా తొలగిపోతుంది. దీనిని వాడిన మొదటి సారే మనం ఖచ్చితంగా చక్కటి ఫలితాలను సొంతం చేసుకోవచ్చు.ఇంకా అదే విధంగా చంక భాగంలో నలుపు తొలగించే మరో టిప్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. దీని కోసం ముందుగా ఒక గిన్నెలో 3 టీ స్పూన్ల శనగపిండిని తీసుకోని ఆ తరువాత ఇందులో ఒక టీ స్పూన్ పసుపు, రెండు టీ స్పూన్ల పంచదార ఇంకా 2 టీ స్పూన్ల పెరుగు వేసి కలపాలి.ఆ తరువాత ఈ మిశ్రమాన్ని చంక భాగంలో రాస్తూ మర్దనా చేయాలి. అది పూర్తిగా ఆరిన తరువాత నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చంక భాగంలో పేరుకుపోయిన నలుపు, మృతకణాలు ఇంకా అలాగే మురికి తొలగిపోయి ఆ భాగంలో చర్మం ఖచ్చితంగా తెల్లగా మారుతుంది. ఈ టిప్ ని వారానికి రెండు సార్లు ఉపయోగించడం వల్ల ఖచ్చితంగా చాలా మంచి ఫలితం ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: