హెయిర్ ఫాల్ ని ఆపి జుట్టుని బలంగా మార్చే టిప్?

Purushottham Vinay
హెయిర్ ఫాల్ ని ఆపి జుట్టుని బలంగా మార్చే టిప్?

ఇక జుట్టు సమస్యలను చాలా ఈజీగా తగ్గించడంలో ఉసిరికాయ పొడి మనకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే దీనిలో ఉండే పోషకాలు ఇంకా ఔషధ గుణాలు జుట్టు రాలడాన్ని తగ్గించడంలో ఎంతగానో సహాయపడతాయి. అలాగే ఉసిరికాయ పొడి జుట్టుకు కండిషనర్ లాగా కూడా పని చేస్తుంది.ఇది జుట్టు ఆరోగ్యంగా ఉండేలా చేయడంలో సహాయపడుతుంది. జుట్టు ఒత్తుగా, నల్లగా పెరిగేలా చేయడంలో ఇంకా చుండ్రు సమస్యను నివారించడంలో, అలాగే పేల సమస్యను తగ్గించడంలో కూడా ఉసిరికాయ పొడి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఉసిరికాయ పొడిని ఏవిధంగా ఉపయోగించడం వల్ల మనం జుట్టు సమస్యలను తగ్గించుకోవచ్చో ఇప్పుడు మనం తెలుసుకుందాం.ముందుగా ఒక గిన్నెలో మెంతి పొడిని తీసుకోవాలి.దీనికి సమానంగా ఉసిరికాయ పొడిని కలిపి అందులో తగినన్ని నీళ్లు పోసి బాగా పేస్ట్ లా చేసుకోని ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి ఆరిన తరువాత తలస్నానం చేయడం వల్ల చుండ్రు సమస్య చాలా ఈజీగా తగ్గుతుంది. 


ఇంకా అలాగే జుట్టు రాలడం కూడా ఈజీగా తగ్గుతుంది. అదే విధంగా ఉసిరికాయ, శీకాకాయ పొడిని కలిపి పేస్ట్ లాగా చేసి జుట్టుకు బాగా పట్టించాలి.అది ఆరిన తరువాత తలస్నానం చేస్తే ఖచ్చితంగా జుట్టు చాలా మృదువుగా తయారవుతుంది. ఇంకా అలాగే జుట్టు సమస్యలు తగ్గి జుట్టు పొడవుగా కూడా పెరుగుతుంది. అలాగే నీటిలో ఉసిరికాయ పొడిని కలిపి ఒక 5 నిమిషాల పాటు వేడి చేయాలి. ఈ మిశ్రమం చల్లారిన తరువాత నిమ్మరసంని వేసి కలపాలి. ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని తలకు బాగా పట్టించాలి.ఇక ఆరిన తరువాత రసాయనాలు తక్కువగా ఉన్న షాంపుతో తలస్నానం  చేయడం వల్ల చుండ్రు సమస్య కూడా తగ్గుతుంది. జుట్టు రాలడం తగ్గి జుట్టు ఒత్తుగా ఇంకా నల్లగా ధృడంగా పెరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: