ముఖంపై నల్ల మచ్చలని తగ్గించే సూపర్ ట్రిక్!

Purushottham Vinay
ఇక చాలా మందికి కూడా వయసు పైబడే కొద్ది ముఖంపై నల్ల మచ్చలు ఎక్కువగా వస్తుంటాయి. ఇక ఇవి నొప్పిని, బాదని అయితే కలిగించవు. కానీ ముఖంపై ఈ నల్లటి మచ్చలు ఉండటం వలన వారు మానసికంగా చాలా కుంగిపోతుంటారు. ఇక ఎలా ఈ నల్లమచ్చలను పోగొట్టి అందంగా కనిపించాలి అని ఆలోచిస్తుంటారు. అలాంటి వారు ఇక ఈ చిన్న చిట్కా పాటిస్తే సరిపోతుంది. బియ్యం పిండిని పూర్వకాలంలో మంచి సౌందర్య లేపనంగా  ఉపయోగించేవారు. అందుకే వారికి అసలు ఎటువంటి చర్మ సమస్యలు ఉండేవి కాదు. అలాగే బియ్యం పిండి చర్మానికి అద్భుతమైన ఫలితాలను అందించి చర్మాన్ని ఎంతో ఆరోగ్యంగా ఉంచుతుంది. చర్మంపై మొటిమలు ఇంకా మచ్చలు అలాగే ముడతలను  తగ్గించి చాలా యవ్వనంగా కనిపించేలా చేస్తుంది. ఇది చర్మానికి బ్లీచ్ గా ఇంకా అలాగే స్క్రబ్ గా కూడా సహాయపడి చర్మ సౌందర్యాన్ని బాగా పెంచుతుంది. బియ్యం పిండితో చేసుకునే ఫేస్ ప్యాక్ ల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..


ఇక ఒక కప్పులో బియ్యం పిండి , కలబంద గుజ్జు, తేనె వేసి వాటిని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని ముఖానికి బాగా ఫేస్ ప్యాక్ లా అప్లై చేసుకోవాలి. ఒక అరగంట తర్వాత ముఖాన్ని నీటితో శుభ్రపరుచుకోవాలి. ఇలా తరచూ చేస్తే ముఖంపై మొటిమలు ఇంకా అలాగే మచ్చలు తగ్గిపోయి చర్మానికి మంచి నిగారింపు అందుతుంది.అలాగే మృతకణాలు తొలగిపోతాయి ఒక కప్పులో బియ్యం పిండి ఇంకా బాగా పండిన అరటి పండు గుజ్జు, ఆముదం కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇలా తయారైన మిశ్రమాన్ని కళ్ళ కింద ఏర్పడిన డార్క్ సర్కిల్స్ లపై అప్లై మీరు చేసుకోవాలి. ఇక ఇరవై నిమిషాల తర్వాత నీటితో శుభ్రపరుచుకోవాలి. ఈ ప్యాక్ డార్క్ సర్కిల్స్ ను తగ్గించి ఇంకా అలాగే కళ్ళకింద చర్మాన్ని మృదువుగా మారుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: