ఈ చిట్కాతో ఎంతటి నల్లని వారైనా తెల్లగవ్వడం ఖాయం!

Purushottham Vinay
ముఖం అందంగా తెల్లగా కాంతివంతంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కూడా బాగా కోరుకుంటారు. దాని కోసం రకరకాల ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు.అలాగే కొంతమంది మార్కెట్ లో దొరికే ఎన్నో రకాల ఉత్పత్తులను కూడా వాడుతూ ఉంటారు. ఎన్నో సంవత్సరాల తరబడి వాడినా కూడా అవి పెద్దగా ఫలితాన్ని ఇవ్వవు. ఇక ఆ ఉత్పత్తులు సరైన ఫలితాన్ని ఇవ్వక వారు చాలా నిరాశ చెందుతారు.అలా సరైన ఫలితాలు లేక నిరాశ చెందే వారికి కొన్ని సహజమైన చిట్కాలు వున్నాయి.ఆ చిట్కాలు ఫాలో అయితే వారి సమస్యలకు శాశ్వత పరిష్కారం అనేది దొరుకుతుంది.అలాంటి చిట్కాలలో ఈ చిట్కా కనుక ఫాలో అయితే అసలు నిరాశ చెందకుండా ముఖం కాంతి వంతంగా ఇంకా అలాగే తెల్లగా మెరిసిపోవటం ఖాయం. దీని కోసం కలబందలోని జెల్ ని తీసుకొని మెత్తని పేస్ట్ గా చేసి వడకట్టి జెల్ తీయాలి. ఈ జెల్ ని పది నిమిషాలు పాటు ఫ్రిజ్ లో పెట్టాలి.ఇక ఆ తర్వాత చిన్న క్యారెట్ తీసుకొని పైతొక్క తీసి తురిమి మిక్సీలో వేసి బాగా జ్యూస్ గా తయారుచేసుకోవాలి.


ఈ జ్యూస్ లో రెండు స్పూన్ల బియ్యపు పిండిని వేసి డబుల్ బాయిలింగ్ పద్దతిలో బాగా వేడి చేసి క్రీమ్ అయ్యేలా కలుపుతూ ఉండాలి. ఈ క్రీమ్ లో ఆలోవెరా జెల్ ని వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని రాత్రి పడుకొనే ముందు ముఖానికి రాసుకోని ఒక పది నిమిషాలు అయ్యాక చల్లని నీటితో బాగా శుభ్రం చేయాలి. అయితే ముఖాన్ని సబ్బుతో అస్సలు రుద్దకూడదు. మరుసటి రోజు ముఖాన్ని సబ్బుతో బాగా శుభ్రం చేసుకోవచ్చు.అలాగే క్యారెట్ లో ఉన్న విటమిన్ A చర్మం మీద మచ్చలు ఇంకా అలాగే మొటిమలు లేకుండా చేస్తుంది. ఆలోవెరా ముఖం మీద మృత కణాలను కూడా తొలగిస్తుంది. ఈ క్రీమ్ ని రాత్రి సమయంలో మాత్రమే ముఖానికి రాయాలి. ఈ వేసవిలో ఇవి ముఖానికి మంచి చల్లదనాన్ని ఇస్తుంది

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: