ఒక కప్పులో బంగాళాదుంప గుజ్జు (Potato pulp) ఇంకా అలాగే రెండు స్పూన్ ల ఓట్స్ పొడి (Oatmeal), రెండు స్పూన్ ల పాలు (Milk), కొంచెం తేనె (Honey), కొన్ని చుక్కల ఆలివ్ నూనెను అందులో (Olive oil) వేసి బాగా కలుపుకోవాలి. ఇలా తయారైన మిశ్రమాన్ని మీ ముఖానికి అప్లై చేసి ఒక 20 నిమిషాలు ఉంచుకొని ఇక ఆ తర్వాత గోరువెచ్చని నీటితో మీ ముఖాన్ని బాగా శుభ్రపరుచుకోవాలి. ఇలా తరచూ చెయ్యడం వల్ల మీ చర్మం మృదువుగా మారి చాలా అందంగా కనిపిస్తుంది.ఇక అలాగే ఒక కప్పులో బొప్పాయి గుజ్జు (Papaya pulp) ఇంకా అలాగే కొద్దిగా బియ్యపు పిండిని (Rice flour) వేసి బాగా కలుపుకోవాలి. ఇక ఈ మిశ్రమాన్ని మీ ముఖానికి బాగా అప్లై చేసుకుని ఒక అరగంట తర్వాత చల్లటి నీటితో మీ ముఖాన్ని బాగా శుభ్రపరుచుకోవాలి. ఇక ఇలా తరచూ చేయడం వల్ల మీ ముఖంపై ముడతలు ఈజీగా తగ్గి చర్మం బాగా బిగుతుగా తయారవుతుంది. దీంతో ముఖంపై వృద్ధాప్య లక్షణాలు అనేవి చాలా ఈజీగా తగ్గిపోతాయి.ఇంకా అలాగే ఒక కప్పులో బాగా పండిన బొప్పాయి గుజ్జు (Papaya pulp), తేనె (Honey), పెరుగు (Curd) వేసుకోని బాగా కలుపుకోవాలి.
ఇక ఈ మిశ్రమాన్ని మీ ముఖానికి అప్లై చేసుకుని ఒక అరగంట తరువాత చల్లటి నీటితో మీ ముఖాన్ని బాగా శుభ్రపరుచుకోవాలి. ఈ బొప్పాయి గుజ్జు అనేది మీ చర్మానికి సహజ ఫీలింగ్ ఏజెంటుగా ఎంతగానో సహాయపడుతుంది. ఇది ముఖం పై మొటిమలు ఇంకా మచ్చలను చాలా ఈజీగా తొలగించి మీ చర్మం సౌందర్యాన్ని బాగా పెంచుతుంది.ఇంకా అలాగే కలుషిత వాతావరణం కారణంగా చర్మకణాలులో మురికి అనేది బాగా పేరుకుపోతుంది. అందుకు చర్మాన్ని శుభ్రపరచడం కోసం ఒక కప్పులో టమోటా గుజ్జు (Tomato pulp) ఇంకా అలాగే కొద్దిగా తేనె (Honey) వేసి బాగా కలుపుకోవాలి. ఇక ఈ మిశ్రమాన్ని చేతి వేళ్లతో ముఖానికి సున్నితంగా రుద్ది బాగా మర్దన చేసుకోవాలి. ఇలా చేసుకొని ఇరవై నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో మీ ముఖాన్ని శుభ్ర పరుచుకోవాలి. ఇది చర్మ కణాలలో పేరుకుపోయి ఉన్న మురికిని ఈజీగా తొలగించి మీ చర్మాన్ని చాలా తాజాగా ఉంచుతుంది.