స్నానానికి స్క్రబ్ వాడుతున్నారా..?

Divya
స్నానానికి చాలా మంది స్క్రబ్ ను ఉపయోగిస్తున్న విషయం అందరికి తెలిసిందే. ముఖ్యంగా ఈ లూఫాకు బాత్రూంలో సపరేటు స్థలం కూడా ఉంటుంది. అయితే ఈ లుఫా ఉపయోగించడం వల్ల చర్మం ఇరిటేట్ అవడంతో పాటు డామేజ్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. అంతే కాదు కొన్ని కొన్ని సందర్భాలలో బ్యాక్టీరియాకు నిలయంగా ఈ లూఫా పనిచేస్తుంది అని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అంతేకాదు చర్మం ఇన్ఫెక్షన్లకు కూడా గురి అయ్యే ప్రమాదం ఉంటుంది.. చర్మం మీద చిన్న చిన్న యాక్నే సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువ. ఒకవేళ మీరు కూడా దీనిని ఉపయోగిస్తూ ఉంటే ఈ విషయాలను తప్పకుండా తెలుసుకోండి.

1. జాగ్రత్తలు ఎక్కువ:
లూఫా ను ఉపయోగించక ముందు ఉపయోగించిన తరువాత కూడా డిస్ ఇన్ఫెక్ట్ తో కచ్చితంగా శుభ్రం చేయాలి. సాధారణంగా చాలా మంది నార్మల్ వాటర్ తో శుభ్రం చేస్తూ  ఒక సైడ్ గోడకి తగిలిస్తూ ఉంటారు. అయితే దీనిని ఇలా సైడ్ పెట్టడం వల్ల ఇందులో ఎన్నో మైక్రో బ్యాక్టీరియా అభివృద్ధి చెందుతాయి. ఇక మనం ఉపయోగించిన ప్రతిసారీ ఆ బ్యాక్టీరియా మన చర్మం పైన పేరుకుపోయి చర్మం డ్యామేజ్ అయ్యే అవకాశాలతో పాటు ఇన్ ఫెక్షన్ సోకే ప్రమాదం కూడా ఎక్కువే.

2. చర్మం మీద హార్ష్ గా:
సాధారణంగా మనం దీనిని ఎందుకు ఉపయోగిస్తాము అంటే చర్మాన్ని ఎక్స్ ఫోలియెట్ చేయడానికి. అయితే సాధారణంగా అందరికీ తెలియని విషయం ఏమిటంటే చర్మం ఎప్పటికప్పుడు ఎక్స్ ఫోలియేట్ అవుతుంది.. ఇక దీనిని ఉపయోగించడం వల్ల చర్మం తట్టుకో కపోగా దురద వచ్చే అవకాశాలు కూడా ఎక్కువ. అంతేకాదు ఈ లుఫాను  అందరి చర్మ తత్వాలకు తగ్గట్టుగా తయారుచేయబడ్డ లేదు కాబట్టి మృదువైన చర్మం కలవారు దీనిని ఉపయోగించక పోవడమే మంచిది.

మార్కెట్లో బాడీ వాష్ జెల్ వస్తున్నాయి కాబట్టి వాటిని ఉపయోగించి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: