బొగ్గుతో భామ ముఖానికి మెరుగులు..ఎలాగంటే..?

Divya
పురాతన కాలంలో కట్టెల ద్వారా వంట చేసిన తర్వాత కాలిపోయి మిగిలిన బొగ్గుతో మన పెద్ద వాళ్ళు దంతాలను శుభ్రం చేసుకునేవారు. ఈ బొగ్గుతో దంతాలు తోముకున్నప్పుడు పన్నుపై ఉండే సూక్ష్మక్రిములు దూరం అవ్వడమే కాకుండా అప్పటికే పేరుకుపోయిన పాచి కూడా పోయి పన్ను తళ తళా మెరిసిపోతూ ఉండేవి.. అయితే ప్రస్తుతం వాహనాల ద్వారా వెలువడే రసాయన కార్బన్ ఉద్గారాల ఫలితంగా దెబ్బతిన్న చర్మాన్ని ఆరోగ్యంగా మార్చగలిగే శక్తి కేవలం బొగ్గు కు మాత్రమే ఉంది అని చెబుతున్నారు సౌందర్యనిపుణులు. ఈ బొగ్గును మెత్తగా నూరి ముఖానికి పట్టించడం వల్ల లెక్కలేనన్ని సౌందర్య ప్రయోజనాలు కూడా కలుగుతాయట.

ప్రస్తుతం లాక్ డౌన్ ముగిసిన తర్వాత ఎక్కడ చూసినా కాలుష్యం , గ్లోబల్ వార్మింగ్ తో వాతావరణం మొత్తం కలుషితమవుతోంది. ఫలితంగా చర్మాన్ని పాడు చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. చర్మాన్ని తిరిగి తేజోవంతంగా.. ఆరోగ్యవంతంగా.. మార్చుకోవాలి అంటే మనకున్న ఒకే ఒక మార్గం బొగ్గు. చార్ కోల్ పేరిట ఎన్నో ఉత్పత్తులు మార్కెట్లో లభ్యమవుతున్నాయి. అయితే ఈ బొగ్గుతో మన చర్మాన్ని ఎలా అందంగా.. ఆరోగ్యంగా తీర్చిదిద్దుకోవచ్చో ఇప్పుడు మనం చదివి తెలుసుకుందాం..
ఆక్సిజన్ వాయువు తో అధిక ఉష్ణోగ్రత వద్ద బొగ్గు ను పౌడర్ గా మార్చిన దానిని యాక్టివేటెడ్ చార్ కోల్ అని పిలుస్తారు.  కొద్దిగా ముఖానికి అప్లై చేయడం వల్ల చర్మ రంధ్రాలలో పేరుకుపోయిన మలినాలు, మురికి,దుమ్ము సమర్థవంతంగా శుభ్రం చేస్తుంది. ఇక మార్కెట్లో దొరికే ఆక్టివేట్ చార్ కోల్ ను ఉపయోగించడం వల్ల చర్మంపై చాలా ఎఫెక్టివ్ గా పని చేయడమే కాకుండా వైట్ హెడ్స్,  బ్లాక్ హెడ్స్ వంటి మలినాలను కూడా తొలగించుకోవచ్చు. ఇకపోతే యాక్టివేటెడ్ చార్ కోల్ ఉపయోగించడం వల్ల ముఖానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి..ఎక్కువగా బ్యూటీ ప్రొడక్ట్స్ లో యాక్టివేటెడ్ చార్ కోల్ ను ఉపయోగిస్తున్నారు. అంతే కాదు ఇది ఫేస్ వాష్ లు,  మాస్క్,  సబ్బుల రూపంలో కూడా చర్మాన్ని సంరక్షిస్తాయి.

దీనిని ఉపయోగించడం వలన రంధ్రాలను శుభ్రపరచడం తో పాటు చర్మాన్ని మృదువుగా మార్చుతుంది. అంతేకాదు మొటిమలు ,చర్మంపై ఏర్పడే గీతలు ,చర్మం పొడిబారిపోవడం లాంటి  సమస్యలన్నింటికీ పరిష్కారం దొరుకుతుంది. ఇక  ముఖంపై ఏర్పడే ఆయిల్ ను బ్యాలెన్స్ చేయడంతో పాటు చర్మాన్ని ఎక్స్ ఫోలియేట్ చేయడంలో సమర్థవంతంగా పనిచేస్తుంది. మృతకణాలను తొలగించి చర్మం రంగును మెరుగు పరిచి ఆరోగ్యవంతమైన చర్మాన్ని మనకు అందించడంలో యాక్టివేటెడ్ చార్ కోల్  చాలా బాగా పనిచేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: