ఆ ఆకులు అందాన్నిస్థాయి

D.V.Aravind Chowdary
భోజనం చేశాక జీర్ణక్రియను మెరుగుపరిచేందుకు తమలపాకు తాంబూలం వేసుకోడం అనాదిగా వస్తున్నాదే. అంతేకాదు , తమలపాకులకు ఆరోగ్యాన్ని , సౌందర్యాన్ని పెంపొందించే అద్భుత గుణాలు సైతం ఉన్నాయి. ఆ ఆకుల్ని ఉపయోగించి మరింత అందంగా , ఆరోగ్యంగా ఏలా తయారవవచ్చో తెలుసుకుందాం .
తమలపాకులు జుట్టు రాలడాన్ని తగ్గించడంలో చాలా కీలకమైన పాత్ర పోషిస్తాయి. ఆయుర్వేద శాస్త్రం కూడా జుట్టు రాలే సమస్యకు ఈవి శ్రేష్టమని చెబుతుంది. ఈ ఆకులను కొబ్బరి నూనెతో  లేదా నువ్వుల నూనెతో కలిపి బాగా నూరి ఆ ముద్దను మాడుకు బాగా పట్టించి గంట తర్వాత తలస్నానం చేయాలి. ఇలా చేయడం ద్వారా జుట్టు రాలే సమస్య చాలా వరకు  తగ్గుతుంది.
నోటిని శుబ్రపరచడంలో తమలపాకులు బాగా తోడ్పడడతాయి . ఇవి దంతక్షయాన్ని అరికట్టి చిగుళ్ళను బలంగా , ఆరోగ్యంగా తయారుచేస్తాయి.ఆకులను నీళ్ళలో ఉడకబెట్టి కషాయం లా తయారు చేసుకొని ప్రతి రోజు నోటితో పుక్కిలించాలి.
తమలపాకులతో చేసిన కాషాయంతో ముఖాన్ని కడుక్కోవడం లేదా ఆకులు , పసుపు తో చేసిన మిశ్రమాన్ని ముఖానికి పట్టించి గంట సేపు తర్వాత కడిగేయాలి. ఇలా రోజుకు  రెండు సార్లు చేయడం ద్వారా ముఖం మీద ఉన్న మొటిమలు తొలిగిపోతాయి .
నీళ్ళలో తమలపాకులతో చేసిన రసం లేదా తమలపాకులతో చేసిన నూనె వేసుకొని స్నానం చేస్తే శరీరం ఎక్కువసేపు తాజాగా ఉండటమే కాకుండా శరీర దుర్వాసన క్రిములు నాశనం అవుతాయి.
తకమలపాకుల్ని  నీళ్ళలో వేసి ఆకులు మెత్తగా అయ్యేవరకు కాచి వాటిని నీళ్ళలో తీసేయాలి. ఇలా కాచిన నీళ్ళను స్నానం చేసే నీళ్ళలో కలుపుకొని స్నానం చేయడం ద్వారా దురద వంటి చర్మ వ్యాధులు తగ్గుతాయి లేదా శరీరంలో దురదగా లేదా వాపుగా  ఉన్న భాగాన్ని ఈ నీళ్ళతో బాగా తడిపితే సహజంగానే   తగ్గిపోతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: