అందమైన ముఖంపైన దద్దుర్లు, పులిపిర్లతో ఇబ్బంది పడుతున్నారా ?

VAMSI
ఆయిల్ స్కిన్ కారణంగా బయట కాలుష్యం కారణంగా ప్రస్తుతం తింటున్న ఆహార పదార్థాల వలన చర్మంపై దద్దుర్లు, మొటిమలు, పులిపిర్లు వంటివి వస్తుంటాయి. ఇవి చివరికి మచ్చలా ఏర్పడుతుంటాయి. వాటిని పోగొట్టడానికి ఎన్ని రకాల క్రీములు, మెడిసిన్ లు వాడినా పెద్దగా ఫలితం ఉండకపోవచ్చు. అలాంటి వారు ఈ సమస్యను ఎలా పరిష్కరించాలి, చర్మంపై ఉన్నటువంటి వీటిని మరియు వీటి వలన ఏర్పడే మచ్చలను ఎలా తొలగించాలి అంటూ చాలా చింతిస్తూ ఉంటారు. అయితే అన్నిటికన్నా పులిపిర్లు అనేవి మనిషికి ఎక్కువ హాని చేసే అవకాశం ఉందని అంటున్నారు వైద్యులు. వైరల్ ఇన్ ఫెక్షన్ కారణం చేత వచ్చేటటువంటి ఈ పులిపిర్లు పెరిగే కొద్ది రక్త నాళాలపై ప్రభావం చూపుతాయని డాక్టర్లు చెబుతున్నారు.
లేజర్ చికిత్స, ఆయుర్వేదిక్ మెడిసిన్, పెరటి చిట్కాలు వంటివి ఉపయోగించి పులిపిర్ల నుండి విముక్తి పొందవచ్చు అని డాక్టర్లు చెబుతున్నారు. ఇక చర్మంపై మిగిలిపోయే నల్ల మచ్చలను తొలగించడానికి... తరచూ శెనగపిండి సున్నిపిండిని వంటి వాటిని ముఖానికి బాగా రాసుకుని మసాజ్ చేసుకుని కొంత సేపు తర్వాత శుభ్రం చేసుకోవాలి ఇటు వంటి చిట్కాలు పాటించడం ద్వారా ముఖంపై ఉన్న నల్ల మచ్చలను సహజంగా పోగొట్టుకోవచ్చు. లేదా కొద్దిగా నిమ్మరసాన్ని బియ్యపు పిండిలో వేసి బాగా కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించాలి. ఇలా వారానికి రెండు మూడు సార్లు చేయడం వల్ల కూడా మంచి ఫలితం లభిస్తుంది.
బియ్యపు పిండి బదులుగా సెనగపిండి వాడినా రిజల్ట్ బాగానే ఉంటుంది. చర్మంపై వచ్చే దద్దుర్లు వంటి వాటికి గుడ్ బై చెప్పాలి అంటే మీరు మరుగుతున్న నీటిలో కొన్ని వేపాకులు వేసి మరిగించి ఆ నీటితో స్నానం చేస్తే చక్కని ఫలితాలు అందుతాయట. మరి ఈ చిట్కాలను పూర్తిగా అర్ధం చేసుకుని మాత్రమే వాడండి. సగం పరిజ్ఞానంతో ఇలాంటివి పాటిస్తే చర్మం పాడయ్యే అవకాశాలు ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: