
మోచేతులు, మోకాళ్ల దగ్గర నల్లగా ఉందా.. ఇలా చేస్తే మటుమాయం!
చిట్కా:కొద్దిగా శనగపిండి తీసుకోండి. ఆ సెనగపిండిలో చిటికెడు బేకింగ్ సోడా, 4 - 5 రోజ్ వాటర్ చుక్కలు వేసి ఒక పేస్ట్ లాగా కలుపుకోవాలి. ఇప్పుడు మోకాళ్ళు, మోచేతుల ని శుభ్రంగా కడుగుకొని ఈ పేస్ట్ ను అప్లై చేసుకోవాలి. ఆ ప్యాక్ ఎండిపోయిన తర్వాత గోరువెచ్చని నీళ్లతో క్లీన్ చేసుకోవాలి. కొద్దిగా అలోవెరా గుజ్జుని మోకాళ్ళు, మోచేతుల పై పెట్టుకొని ఆరనివ్వాలి. ఆరిపోయిన తర్వాత చల్లటి నీళ్లతో కడిగేసుకోవాలి. ఇలా వారానికి ఒకటి లేదా రెండు సార్లు క్రమం గా చేస్తుంటే ఫలితాలు మీరే చూస్తారు.ముఖం కన్నా కూడా మోకాళ్ళు, మోచేతుల దగ్గర చర్మం మందమైన చర్మం ఉండటం కారణంగా, మనం అనుకున్న ఫలితాలు రావాలి అని అంటే కొంచెం ఎక్కువ టైం పడుతుంది.బేకింగ్ సోడా లో బ్లీచింగ్ లక్షణాలు ఉన్నాయి. నల్లగా ఉన్న మోచేతులు, మోకాళ్లు పోగొట్టడంలో సహాయపడతాయి.
బేకింగ్ సోడా లో ఉన్న న్యాచురల్ బ్లీచింగ్ ప్రాపర్టీస్, నిమ్మకాయ లో ఉన్న స్కిన్ లైటెనింగ్ ఎలిమెంట్స్, అలోవెరా లో ఉన్న అలోయిన్ అండ్ అలోయిసిన్ ఇవన్నీ స్కిన్ లైటెనింగ్ అవ్వడానికి సహాయపడతాయి.
(గమనిక: స్కిన్ పైన రషెస్, రియాక్షన్ లాంటివి ఏమైనా వస్తే డాక్టర్ ను సంప్రదించండి. సెన్సిటివ్ స్కిన్ ఉన్నవారు, స్పెషల్ స్కిన్ కండీషన్స్ ఉన్నవారు జాగ్రత్త).