శరీర దుర్వాసనతో ఇబ్బంది పడుతున్నారా... ?

VAMSI
చెమట పడితే ఎంతో కొంత శరీరం నుండి దుర్వాసన వస్తుంది అది సహజమే. కానీ కొందరికి నిరంతరం శరీరం నుండి ఒక రకమైన దుర్వాసన వస్తూ ఉంటుంది. రోజుకు ఒకటికి రెండు మూడు సార్లు స్నానం చేసినా... గంటల తరబడి సబ్బులతో కుస్తీలు పడినా..కాసేపు ఫ్రెష్ గా ఉంటారు. కానీ మళ్ళీ ఆ దుర్వాసన మిమ్మల్ని చుట్టేస్తుంది. ఇలాంటి వారు నలుగురిలోకి రావాలంటే చాలా ఇబ్బంది పడుతుంటారు. ఆ దుర్వాసన ఇతరులకు ఎక్కడ వచ్చి తమను అసహ్యించుకుంటారా అని బయట అందరి మధ్య తిరగడానికి కాస్త సంకోచిస్తుంటారు. కొందరు రకరకాల పౌడర్లు మరియు బాడీ స్ప్రే లు వినియోగించి.. వినియోగించి విసిగిపోయి ఉంటారు. ఇలాంటి వారు ఈ చిట్కాలను పాటిస్తే దుర్వాసన ను నుండి కాస్త విముక్తి పొందొచ్చు. మరి ఇంకెందుకు లేటు అవేంటో చూద్దాం పదండి.
*ముందుగా అటువంటి వారు శరీరంపై అవాంఛిత రోమాలను ఎప్పటికప్పుడు పెరగకుండా తొలగించుకుంటూ ఉండాలి.
*టీ మరియు కాఫీలు శరీరం నుండి ఎక్కువ చెమట ఉత్పత్తి అవడానికి ముఖ్య కారకాలు ముందుగా కాఫీ.  కావున కాఫీని తరచూ తాగడం మానేయండి.
*స్నానం చేయాలనుకునే నీటిలో కొద్దిగా పుదీనా వేసి బాగా మరిగించి ఆ నీటితో స్నానం చేయడం ద్వారా చర్మం ఎక్కువ సేపు తాజాగా ఉండి, దుర్వాసన రాకుండా కాపాడుతుంది. ఇది చర్మ సౌందర్యానికి కి కూడా బాగా ఉపయోగపడుతుంది.
*స్నానం చేసే బకిటెడు నీటిలో ఒక టేబుల్ స్పూన్ వరకు తేనెను తీసుకుని బాగా కలపాలి, ఆ తేనె కలిపినటువంటి నీటితో స్నానం చేస్తే ...అంత ఈజీగా చెమట పట్టదు. ఎక్కువ సేపు చెమట పట్టకుండా ఉంటుంది. ఒకవేళ చెమట పట్టిన అంతగా దుర్వాసన రాకుండా ఉంటుంది.
పై చిట్కాలను పాటించడం వలన చెమట నుండి అలాగే దానివల్ల కలిగే దుర్వాసన నుండి ఉపశమనం పొందవచ్చు. అలాగే మంచి సువాసన విరజల్లే పౌడర్లను కూడా వాడండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: