మృదువైన చర్మం కోసం ఎప్పుడైనా ఇది ప్రయత్నించారా?

Manasa
ఎటువంటి ముడతలు, మొటిమలు లేకుండా మృదువైన చర్మం కావాలి అని  చాలా మంది కోరుకుంటారు.
మరి అది ఊరికే  రాదు కదా. మన వంతు మనం మన చర్మాన్ని కాపాడుకునే కొన్ని చిట్కాలు, జాగ్రత్తలు పాటిస్తుంటే సరిపోతుంది.  సాఫ్ట్ అండ్ స్మూత్ స్కిన్ ని మన సొంతం చేసుకోవచ్చు. మరి సాఫ్ట్ అండ్ స్మూత్ స్కిన్ కోసం ఈ ఇంటి చిట్కను ట్రై చేసి ఫలితాలను మీరే గమనించండి.పండ్లు మన ఆరోగ్యానికి ఎంతో మంచిది.  ప్రతి ఒక పండు కి ఒక విశేషం ఉంది. అలాగే పప్పాయ కి దానికంటూ ఒక ప్రత్యేక స్థానం ఉంది.  పప్పాయ(బొప్పాయి) తినడం ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో, దానిలో ఉన్న పోషకాలు/పదార్థాలు చర్మాన్ని అంతే సౌందర్యవంతంగా చేస్తుంది. దీన్ని ఎంతో  ఇష్టంగా తింటారు, అలాగే ఎన్నో  బ్యూటీ ప్రాడెక్ట్స్ లో కూడా దీని వాడకం బాగానే ఉంటుంది. మరి ఈ పప్పాయ తో ఒక మంచి హోమ్ మేడ్ ఫేస్ ప్యాక్ గురించి తెలుసుకుందామా??
 చిట్కా:  ఒక పండిపోయిన పప్పాయ( బొప్పాయి) ముక్కని తీసుకుని దాన్ని గుజ్జు  (స్మాష్) చేయండి. ఇప్పుడు ఆ బొప్పాయి(పప్పాయ) గుజ్జులో  కొద్దిగా తేనె , మీగడ  మరియు కొన్ని రోజ్ వాటర్ చుక్కలు  వేసి ఒక పేస్ట్ లాగా కలుపుకోవాలి. మొఖాన్ని గోరువెచ్చని నీళ్లతో కడుగుకొని తడి ఆరక ఈ ప్యాక్ని ముఖం అంత వేసుకొని ఆ ప్యాక్ ఎండిపోయే వరకు ఆగాలి. ప్యాక్ ఎండిపోయిన తర్వాత చల్లని నీళ్ళతో ముఖాన్ని కడిగేసుకొని మాయిశ్చరైజర్ రాసుకోవచ్చు.
ఇలా  క్రమం తప్పకుండా  వారానికి ఒకసారి ఈ ప్యాక్ వేసుకుంటే కొన్ని నెలల్లో ఎంతో సాఫ్ట్ మరియు మృదువైన స్కిన్  మీరే చూస్తారు.
గమనిక: ఈ ప్యాక్ ట్రై చేసే కన్నా ముందు ఒకసారి ప్యాచ్ టెస్ట్ చేసుకొని చూడండి.

(ఏదైనా  స్కిన్ ఇరిటేషన్ లేదా రియాక్షన్ వంటివి వస్తే వెంటనే డాక్టర్ను సంప్రదించండి)

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: