వీటితో డ్రై స్కిన్ సమస్య తగ్గడం ఖాయం..

Purushottham Vinay
డ్రై స్కిన్ చికిత్స చేయడానికి తేనె ఒక అద్భుతమైన నివారణ. వాటిలో విటమిన్లు ఇంకా యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.అలాగే యాంటీమైక్రోబయల్ ఇంకా యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇంకా ఇది నేరుగా కూడా చర్మానికి అప్లై చేయవచ్చు. మీరు ఈ తేనెను ఫేస్ మాస్క్ లాగా కూడా అప్లై చేసి గోరువెచ్చని నీటితో బాగా శుభ్రం చేసుకోవచ్చు.అలాగే పొడి చర్మాన్ని నివారించడానికి తేనెను మీరు ఓట్స్‌తో కూడా కలపవచ్చు.అలాగే అవోకాడో మాస్క్‌లు చర్మాన్ని పోషించడానికి ఇంకా చైతన్యం నింపడానికి చాలా బాగుంటాయి. అలాగే అవోకాడో గుజ్జును ఒక గిన్నెలో తీసుకొని అందులో ఒక టీస్పూన్ ఆలివ్ ఆయిల్ ఇంకా తేనెను కలపండి. ఇక ఈ మిశ్రమాన్ని మీ ముఖానికి బాగా అప్లై చేసి 15 నుండి 20 నిమిషాల పాటు అలాగే ఉంచి ఆ తర్వాత మీ ముఖాన్ని కడిగేయండి.ఇక ఇది మీ పొడి ముఖానికి కూడా ఒక ఔషధం.

ఇక కొబ్బరి నూనెలో కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇక అలాగే ఇందులో వుండే మెత్తగా ఉండే గుణాలు పొడి చర్మం కోసం కూడా బాగా పనిచేస్తుంది. అలాగే ఎమోలియంట్లు చర్మ కణాల మధ్య అంతరాలను పూరిస్తాయి. ఇంకా మీ చర్మాన్ని హైడ్రేట్ ఇంకా అలాగే మృదువుగా ఉంచుతాయి. మీరు రాత్రి పడుకునే ముందు పొడిబారిన చర్మంపై కొన్ని చుక్కల కొబ్బరి నూనెను అప్లై చేసుకోని పడుకుంటే డ్రై స్కిన్ సమస్య అనేది తగ్గిపోతుంది.ఇక అలాగే పొద్దుతిరుగుడు పువ్వు నూనె చర్మంలో తేమను నిలుపుకోవడంలో ఎంతగానో సహాయపడే మరొక సహజ నూనె అని చెప్పాలి.విటమిన్ E ఎక్కువగా ఉండే ఈ నూనె తేమను బంధిస్తుంది.ఇంకా అలాగే చర్మ కణాలలో తేమను కూడా నిలుపుకుంటుంది. పొద్దుతిరుగుడు నూనె ఆస్తమా ఇంకా ఆర్థరైటిస్ వంటి అనేక వ్యాధులను కూడా నివారిస్తుంది. ఇంకా కణాలను పునరుద్ధరించడానికి కూడా ఇది ఎంతగానో సహాయపడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: