కాకరకాయ ఫేస్ ప్యాక్ తో అదిరిపోయే అందం

Purushottham Vinay
కాకరకాయ వల్ల ఎన్నో లాభాలు వున్నాయి. ఇక మొటిమలు సమస్యతో బాధపడేవారు కారకాయ రసాన్ని ముఖానికి బాగా రాసుకుని ఒక ఐదు నిమిషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రంగా కడుగుకోవాలి. ఇలా ప్రతిరోజు చెయ్యడం వలన ముఖంపై వుండే మొటిమలు ఇంకా మచ్చలు తగ్గడమే కాకుండా ముఖం ఎంతో కాంతివంతంగా మారుతుంది.ఇక అలాగే ముఖంపై మచ్చలు అనేవి బాగా ఎక్కువగా ఉంటె కాకరకాయ ఇంకా కరివేపాకు మిశ్రమాన్ని అప్లై చేస్తే మంచి ఫలితం ఉంటుంది.ఇక కాకరకాయని పేస్ట్ లా చేసుకుని అందులో కొంచెం కరివేపాకు మిశ్రమం కలిపి దీన్ని ముఖానికి మంచి ప్యాక్‌లా వేయాలి.ఇక శుభ్రంగా ఆరిన తర్వాత నీటితో బాగా శుభ్రం చేసుకోవాలి. దీనివల్ల ముఖంపై మచ్చలు ఇంకా మొటిమలు సమస్యలు అనేవి చాలా వరకూ తగ్గిపోతాయి.ఇక ముఖం బాగా ప్రెష్ గా ఉండడానికి కాకరకాయ నీరు అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ముందుగా కాకర ముక్కలను నీటిలో బాగా మరిగించాలి.

ఇక ఆ నీటిలో కాటన్ బాల్ ని ముంచి ముఖాన్ని బాగా క్లీన్ చేసుకోవాలి.ఇక ఇలా చేయడం వలన ముఖం ఎంతో ప్రెష్ గా ఉండడమే కాకుండా మచ్చలు అనేవి కూడా పూర్తిగా తగ్గుతాయి. అలాగే కాకరకాయ నీరు కూడా ముఖానికి మంచి టోనర్‌గా ఉపయోగపడుతుంది.ఇక ముఖం కాంతివంతంగా మారడానికి కాకరకాయ, జాజికాయ, పెరుగు ఫేస్ ప్యాక్ అనేది బాగా పనిచేస్తుంది. కాకరకాయ సగం ముక్కని తీసుకుని బాగా పేస్ట్‌లా చేయాలి. ఇక ఇందులో జాజికాయ పొడి అలాగే పెరుగు వేసి బాగా కలిపాలి.ఇక ఆ మిశ్రమాన్ని ముఖంపై ప్యాక్‌లా వేసుకోవాలి.ఇక అలాగే కొద్దీ సేపటి తర్వాత చల్లని నీటితో ముఖాన్ని కడుక్కోవాలి. ఇలా కొన్ని రోజులు చేస్తే మంచి ఫలితం అనేది దక్కుతుంది.ఇక ఎన్ని ఖరీదైన క్రీములు రాసినా కాని అనేక రకాల చర్మ సమస్యలు ఇంకా దురద సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి. ఆ సమస్యలు త్వరగా తగ్గకపోతే కాకరకాయ ఇంకా అలోవెరా పేస్ట్ లో కొంచెం పసుపుని కలుపుకొని  ఈ మిశ్రమాన్ని రాస్తే మంచి ఉపశమనం అనేది కలుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: