పాదాల సంరక్షణకు ఇలా చెయ్యండి...

Purushottham Vinay
చాలా మందిని కూడా పాదాల పగుళ్ల సమస్య చాలా తీవ్రంగా వేదిస్తుంది. ఈ చిన్నపాటి పాదాల పగుళ్ల సమస్యలు వచ్చినా నడవడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది.ఇక ముఖ్యంగా చెప్పాలంటే వర్షాకాలంలో చాలా ఎక్కువగా పాదాల పగుళ్ల సమస్య ఉంటుంది. కాబట్టి వర్షాకాలంలోనే పాదాల పట్ల శ్రద్ధ ఎక్కువ తీసుకోవడం మంచిది. ఇక లేదు అంటే పాదాలు పగిలి పోవడం లేదా కమిలి పోవడం లాంటి సమస్యలు వస్తాయి. అయితే ఎటువంటి జాగ్రత్తలు పాటించడం వల్ల పాదాలు సురక్షితంగా ఉంటాయానేది ఇప్పుడు తెలుసుకోండి. తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించండి.మనం ఇంట్లో అనేక రకాల పనులు చేసుకుంటూ ఉంటాము. బట్టలు ఉతకడం లేక సామాన్లు కడగడం ఇలా అనేక రకాల పనులు చేసుకుంటూ ఉంటాము. ఇటువంటి పనులు చేసుకునేటప్పుడు ఖచ్చితంగా పాదాలు పొడిగా ఉండేలా చూసుకోవాలి. పాదాలు తడిసి పోయి ఉండడం వల్ల పలు పాదాల సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి.

ఇక అలానే వర్షంలో కాళ్ళు తడపడం వలన కూడా పాదాలకు చాలా ఇబ్బంది వస్తుంది. కాబట్టి ఇటువంటి కారణాల వల్ల కాళ్ళు ఇంకా పాదాలను ఖచ్చితంగా తడవకుండా చూసుకోవాలి. పాదాలు బాగా తడిగా ఉండడం వల్ల స్వెల్లింగ్ రావడం ఇంకా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వంటివి వస్తాయి.కాబట్టి ఎప్పుడూ కూడా తడి షూస్ అస్సలు వేసుకోవద్దు. ఇలా తడి షూస్ అనేవి వేసుకోకుండా మీ పాదాల పై కాస్త శ్రద్ధ పెట్టడం చాలా మంచిది.ఇక చాలా మంది కూడా చల్లగా ఉండే దాని పైన ఎక్కువగా నడుస్తూ ఉంటారు. గడ్డి ఇంకా గార్డెన్ ఇలా చాలా రకాల చోట్ల నడుస్తుంటారు.ఆ ప్రదేశాల మీద నడవడం వల్ల పాదాలు చాలా తడిగా అయిపోతాయి. అదే విధంగా దీని కారణంగా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కూడా వచ్చి పాదాల పగుళ్ళకి దారి తీస్తాయి. కాబట్టి మీరు తిరిగేటప్పుడు ఖచ్చితంగా చెప్పుల్ని కానీ షూని కాని తప్పకుండా ధరించండి.అలానే యాంటీ ఫంగల్ పౌడర్ రాసుకోని పాదాలని ఎప్పుడు కూడా పొడిగా ఉంచుకోవడం లాంటివి పాటించాలి.ఇక అలానే మీరు పాదాలను కడిగిన వెంటనే తుడిచి ఆ తర్వాత షూస్ లేదా చెప్పులు వంటివి తప్పకుండా ధరించాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: