మచ్చలు మొటిమలు తగ్గే సింపుల్ టిప్స్...
ఇక కొంచెం ముల్తానీ మట్టి , టొమాటో గుజ్జు , పెరుగు , దోసకాయ రసం సమపాళ్లలో కలిపి ముఖానికి రాసుకోండి. ఇక 20 నిమిషాల తర్వాత శుభ్రంగా కడుక్కోండి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే ముఖం నిగనిగలాడుతూ మెరుస్తూ ఉంటుంది. అలాగే మీ ముఖచర్మం జిడ్డుగా ఉంటే టొమాటో గుజ్జును రాసుకుని ఒక పదిహేను నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీళ్లతో కడుక్కుంటే మంచి ఫలితం ఉంటుంది.ఇక పొడి చర్మం వున్న వారు టొమాటో గుజ్జుకు పెరుగు కలిపి రాసుకుని గోరు వెచ్చటి నీటితో శుభ్రం చేసుకుంటే మంచి ఫలితం తప్పకుండా కనిపిస్తుంది.ఇక ఎండవేడికి చర్మ కమిలినప్పుడు కూడా మొటిమలు వస్తాయి. అప్పుడు టొమాటో , దోస రసాలను సమపాళ్లలో కలిపి రాసుకుంటే మంచి ఉపశమనం లభిస్తుంది. ఫలితంగా మీ చర్మం అనేది బాగా నిగనిలాడుతుంది.ఇక ముఖం మీద మచ్చలు ఉంటే టొమాటో ముక్కతో పదిహేను నిముషాలు పాటు మృదువుగా రుద్దండి.ఇక ఆ తర్వాత చల్లటి నీళ్లతో కడిగేయండి. క్రమం తప్పకుండా రోజు ఇలా చేస్తే త్వరలోనే మీకు ఫలితం కనిపిస్తుంది.ఇక చాలామందికి టొమాటో ముఖానికి రాసుకున్నప్పుడు కొంచెం దురదవంటి ఫీలింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది.అది సహజంగా జరుగుతుంది.అయితే ఆ ఫీలింగ్ ఎక్కువగా ఉన్నట్లయితే వెంటనే ముఖాన్ని చల్లని నీటితో శుభ్రం చేసుకుని పెరుగు రాసుకోండి.తప్పకుండా మంచి ఫలితం ఉంటుంది.