ఇలా చేస్తే క్షణాల్లో సన్నగా, నాజూగ్గా మారడం ఖాయం..!

Divya

ప్రతి ఒక్కరూ అందంగా, నాజూగ్గా , స్లిమ్ గా కనిపించాలని అనుకుంటారు. అందుకోసమే సరైన ఫుడ్ మెయింటెన్ లో పలు జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. ఇక మరికొంతమంది తొందరగా సన్నగా అవ్వాలనేసి వ్యాయామాలు, యోగాలు, ఎక్సర్సైజులు ఇలా ఎన్నో రకాల ఆసనాలను ప్రయత్నిస్తూ,సన్నగా అవ్వాలని తెగ ప్రయాసపడుతూ ఉంటారు.. ఇక అంతే కాకుండా శరీరాన్ని, మనసును దృఢంగా  ఉంచేందుకు, చాలామంది చాలా రకాల వ్యాయామాలు కూడా చేస్తుంటారు.. అయితే ఈ క్రమంలో మీరు ఎప్పుడైనా స్కిప్పింగ్ ను ట్రై చేశారా..? ఒకవేళ చేయకపోతే ఇప్పుడు చెప్పబోయే విషయాలను కూడా తెలుసుకోండి..


మనం ప్రతి రోజూ స్కిప్పింగ్  చేయడం వల్ల శరీరంలోని అదనపు క్యాలరీలు కరిగి,, మంచి శరీరాకృతి సొంతమవుతుంది. అలాగే పొట్ట భాగంలో పేరుకుపోయిన కొవ్వును కూడా ఎలాంటి డైట్ ఫాలో అవకుండా  తగ్గించుకోవచ్చు. అయితే ఇవన్నీ కూడా కేవలం స్కిప్పింగ్ మాత్రమే చేసి కరిగించుకోవచ్చు అంటున్నారు నిపుణులు.. అయితే స్కిప్పింగ్ చేసేటప్పుడు కూడా కొన్ని పద్ధతులను పాటించాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు అడిగే ప్రశ్న కొంచెం సిల్లీ గా ఉన్నా,   ఇందులో ఉండే కొన్ని మెళకువలను మీరు తప్పకుండా తెలుసుకోవాల్సి ఉంటుంది.


ముందుగా మీరు ఉపయోగించే షిప్పింగ్ తాడును మీ పాదాల తో అదిమి పట్టుకుని దాని రెండు అంచులను, మీ ఎత్తుకు సమానంగా ఉండేలా చూసుకోవాలి. తర్వాత తాడు చివర్లను చేతులతో పట్టుకొని ఎగురుతూ.. కేవలం ముందు నుంచి వెనుకకు మాత్రమే కాకుండా వెనుక నుంచి ముందుకు ఎగురుతూ కూడా ప్రాక్టీస్ చేయాలి.


ఇక దీని వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటంటే.. ఈ వ్యాయామం వల్ల భుజాలు తిప్పడం, పాదాలపై ఒత్తిడిని తగ్గించడం వంటి వాటి వల్ల ఆయా భాగాలు దృఢంగా తయారవడంతో పాటు, మిగతా శరీర భాగాలకు కూడా తగిన వ్యాయామం అందుతుంది. ఇక ప్రతి రోజూ ఒక గంట పాటు ఈ రకమైన వ్యాయామం చేస్తే 1,300 కేలరీలు ఖర్చవుతాయి.. స్కిప్పింగ్ చేసేటప్పుడు జంపింగ్ కూడా చేస్తాం, కాబట్టి ఒక పది నిమిషాల పాటు స్కిప్పింగ్ చేయడం వల్ల ఒక మైలు పరిగెత్తిన దానితో సమానం అని నిపుణులు చెబుతున్నారు..


ఇక అలాగే ఎముకల దృఢత్వం కూడా మెరుగుపడుతుంది. అలాగే కాలి కండరాలు, తొడలు కూడా దృఢంగా  తయారవుతాయి.. ఇక మానసికంగా కూడా దృఢంగా తయారు కావచ్చు. ఈ ఆట వల్ల శరీరంలోని అవయవాలు కదలి, జీవక్రియను వేగవంతం అవ్వడంతో పాటు అవయవాల మధ్య సమన్వయం కూడా పెరుగుతుంది. ఇక శ్వాస తీసుకోవడం వేగవంతమవుతుంది.. అయితే  ఈ వ్యాయామం చేసిన తర్వాత కూడా సరైన ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది.  అరగంట తర్వాత మొలకెత్తిన గింజలు, పండ్లు వంటివి తేలికగా ఉండే ఆహారం తీసుకోవడం మంచిది...


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: