ముక్కు మీద కంటి చుట్టూ ఉండే మంగు మచ్చలు తగ్గాలంటే ఏం చేయాలో తెలుసా..?

Divya

సాధారణంగా ముక్కుమీద, కంటిచుట్టూ,  చెంపల పైన ఈ మంగు మచ్చలు అనేవి వస్తూ ఉంటాయి. వీటి వల్ల ముఖం అందవిహీనంగా తయారవుతుంది. తద్వారా ఇలాంటి మంగు మచ్చలు ఎదురవుతున్న వారు ఆత్మవిశ్వాసాన్ని సైతం కోల్పోతారు. కాబట్టి ఈ మంగు మచ్చలు తొలగించుకోవాలంటే కొన్ని సహజమైన పద్ధతులను పాటించాలి అంటున్నారు సౌందర్య నిపుణులు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

సాధారణంగా మంగు మచ్చలు తగ్గాలంటే బియ్యపు నీళ్లు ఎంతో సహాయ పడతాయి. వీటిని తొలగించడం కోసం ఒక గ్లాస్ బియ్యాన్ని తీసుకొని, ఒకసారి శుభ్రంగా కడుగుకోవాలి. రెండవసారి నీళ్లు పోసి రోజంతా నానబెట్టాలి. మరుసటి రోజు బియ్యం నుండి నీటిని వేరు చేసి, ఆ నీటితో ప్రతిరోజు ముఖం కడుక్కోవడం వల్ల మంగు మచ్చలు త్వరగా తగ్గుతాయి.

అంతే కాకుండా మరొక చిట్కా..ఒక టేబుల్ స్పూన్ కలబంద గుజ్జు తీసుకొని, అందుకు సమానమైన పరిమాణంలో ఒక టేబుల్ స్పూన్ రోజ్ వాటర్ కలపాలి. ఆ తర్వాత రెండు చుక్కల నిమ్మరసం వేసి, బాగా మిక్స్ చేయాలి.  ఈ మిశ్రమాన్ని ఎక్కడైతే మంగు మచ్చలు ఉన్నాయో అక్కడ అప్లై చేయాలి. ఇలా వారానికి రెండు సార్లు  మచ్చలు ఉన్న చోట ఈ మిశ్రమాన్ని అప్లై చేసి, సుతి మెత్తగా గా మసాజ్ చేయాలి. ఆ తర్వాత మంచి నీటితో శుభ్రం చేసుకుంటే మంచి ఫలితం లభిస్తుంది..

అయితే ఈ ట్రీట్మెంట్ లో భాగంగా శరీరానికి ఎండ తగలకుండా ఉండేలా చూసుకోవాలి.  ఒకవేళ బయటకు వెళ్లాల్సి వస్తే స్కార్ఫ్ ధరించడం ఉత్తమం. అంతేకాకుండా హెయిర్ డై లాంటి ఉపయోగించకూడదు. ఒకవేళ తప్పనిసరిగా వేసుకోవాలి అనుకున్నప్పుడు మంగు మచ్చలకు ఏదైనా మాయిశ్చరైజర్ ను అప్లై చేసి ఈ హెయిర్ డై లను ఉపయోగించడం ఉత్తమం.  ఒకవేళ మీ దగ్గర మాయిశ్చరైజర్  లేనప్పుడు పాలమీగడను కూడా ఈ మంగు మచ్చల పై రాయవచ్చు..

చూశారు కదా.. ఈ పద్ధతులను ఉపయోగించి, ముక్కు మీద ఉన్న మంగు మచ్చలను ఈజీగా తొలగించుకోవచ్చు...

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: