హెయిర్ ఆయిల్ నిజంగా జుట్టు రాలడాన్ని ఆపుతుందా..?

Divya
జుట్టు ఆరోగ్యంగా ఉండాలి అంటే మాత్రం ఎన్నో రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ముఖ్యంగా జుట్టు సంరక్షణలో శ్రద్ధ వహించాలి. ఎంత ఖరీదైన బట్టలు వేసుకున్నా, ఎంత అందం గా రెడీ అయినప్పటికీ అందుకు తగ్గ  జుట్టు లేకపోతే మాత్రం అంతా వేస్ట్ అవుతుంది. కాబట్టి దాన్ని ఎప్పటికప్పుడు జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండాలి. జుట్టు సంరక్షణ ఎంత బాగుంటే, మనం అంత అందంగా కనిపిస్తాము అనే విషయం మనం గుర్తుంచుకోవాలి.

ఎంత కాపాడుకుంటూ వస్తున్నా, ఎన్నో ఖరీదైన ఆయిల్స్ వాడినా, ఎంతో ప్రాముఖ్యత కలిగిన షాంపూలను ఉపయోగించినప్పటికీ, ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో జుట్టు రాలే సమస్య ను ఎదుర్కోక తప్పదు. ప్రస్తుత కాలంలో మరీ ముఖ్యంగా వయసుతో సంబంధం లేకుండా,ప్రతి ఒక్కరికి విపరీతమైన హెయిర్ ఫాల్ అవుతోంది. దీనిని ఆపడానికి అందరూ పలు రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అంతేకాకుండా వేలకు వేలు ఖర్చుపెట్టి ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు. మరి కొంతమందేమో ఇంట్లో ఉండే పదార్థాలు ఏవో చిట్కాల రూపంలో పాటిస్తున్నారు.

ఇక చాలామంది జుట్టు రాలకుండా కాపాడుకోవడం కోసం, తరచూ చేసే పని జుట్టుకు నూనె రాసుకోవడం. ఎందుకంటే తలకు కొబ్బరి నూనె బాగా పట్టించి,మసాజ్ చేసుకుంటే హాయిగా ఉండడమే కాకుండా వెంట్రుకలు బాగా పెరుగుతాయి అనే భ్రమలో ఉంటారు. నిజానికి జుట్టుకు నూనె రాయడం  వల్ల జుట్టు రాలటాన్ని ఆపలేం అంటున్నారు ప్రముఖ డెర్మటాలజిస్ట్ డాక్టర్ జయశ్రీ శరత్ గారు.

నిజానికి కొబ్బరి నూనె కానీ,వేరే ఇతర ఆయిల్స్ కానీ తలకు కండిషనర్ గా మాత్రమే పనిచేస్తాయి.కానీ జుట్టు పెరుగుదలకు సహాయపడవు. అంతే కాని తలకు బాగా నూనె పట్టించి, మసాజ్ చేసుకోవడం వల్ల ఒత్తిడి నుంచి ఉపశమనం తగ్గుతుంది. అంతేగాని అది జుట్టు కుదుళ్లకు బలాన్ని ఇవ్వడానికి,జుట్టురాలడాన్ని ఆపలేదు అని ఆమె తెలిపారు. వాతావరణంలో వచ్చే మార్పులు  కారణంగా జుట్టు రాలడాన్ని విశ్లేషించలేము. మనం తీసుకునే ఆహారం మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి హెయిర్ ఫాల్ అవకుండా ఉండాలి అంటే తగినంత ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: