క్యారెట్ తో ఫేస్ ప్యాక్ ఎప్పుడైనా ట్రై చేశారా..?

Divya
మనలో చాలా మందికి క్యారెట్ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసు. అలాగే క్యారెట్ వల్ల అందం కూడా పెరుగుతుంది. ఇక క్యారెట్ లో ఎన్నో విటమిన్స్  ఉన్నాయి కాబట్టి అది ఆరోగ్యంతో పాటు అందాన్ని కూడా పెంపొందిస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.క్యారెట్ లో బీటా-కెరోటిన్, విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ కె పుష్కలంగా లభిస్తాయి. ఇవి చర్మ సౌందర్యాన్ని కూడా పెంపొందించుకోవడానికి బాగా ఉపయోగపడతాయి. అయితే ఈ క్యారెట్ ఫేస్ మాస్క్ ను ఎలా వాడాలో? ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం.

నాలుగు టేబుల్ స్పూన్ల క్యారెట్ జ్యూస్ లో రెండు టేబుల్ స్పూన్ల బొప్పాయి జ్యూస్ అందులో కొద్దిగా పాలు వేసి బాగా కలపాలి. ఇక ఈ మిశ్రమంలో కాటన్ బాల్ అద్ది ముఖం అంతటా సమానంగా అప్లై చేయాలి. ఆ తర్వాత ఒక గంట సేపు ఆరనిచ్చి, చల్లని నీటితో కడిగేసుకుంటే ముఖం కాంతివంతంగా తయారవుతుంది.
అంతేకాకుండా ముఖంపై ముడతలు లేదా మచ్చలు  వచ్చినప్పుడు కూడా ఈ ఫేస్ ప్యాక్ చాలా చక్కగా పనిచేస్తుంది. ఇక క్యారెట్ యాంటీ ఏజింగ్ కారకంగా కూడా పనిచేస్తుంది. ఇందుకోసం రెండు టేబుల్ స్పూన్ల క్యారెట్ రసంలో కొద్దిగా అరటిపండు గుజ్జు, గుడ్డులోని తెల్లసొన, నాలుగు చుక్కల నిమ్మరసం కలిపి బాగా  మిశ్రమంలా చేయాలి. ఇక ఈ మిశ్రమాన్ని ముఖంపై రాసుకొని 30 నిమిషాల పాటు ఆరనివ్వాలి. తర్వాత గోరు వెచ్చని నీటితో కడిగేసుకోవాలి. ఇలా వారానికి రెండు సార్లు ఈ పద్ధతిని పాటించడం వల్ల ముఖం మీద ఏర్పడిన ముడతలు కూడా మాయమవుతాయి.
ముఖం తాజాగా ఉండాలంటే ఒక టేబుల్ స్పూన్ క్యారెట్ రసంలో కొద్దిగా తేనె కలిపి ముఖానికి రాసుకుని పదిహేను నిమిషాల పాటు ఆరానివ్వాలి. ఆ తరువాత చల్లని నీటితో కడిగేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ముఖం తాజాగా, కాంతివంతంగా మారుతుంది.
ఇక అంతేకాకుండా ముఖం మీద మొటిమలు ఎక్కువగా ఉన్నట్లయితే రెండు టేబుల్ స్పూన్ల క్యారెట్ జ్యూస్ లో ఒక టేబుల్ స్పూన్ తేనె, చిటికెడు దాల్చిన చెక్క పొడి వేసి బాగా కలపాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని ముఖం అంతా సమానంగా అప్లై చేసి, 20 నిమిషాల పాటు ఆరనివ్వాలి.ఇలా వారానికి రెండు సార్లు చేయడం వల్ల ముఖం మీద మొటిమలు క్రమంగా తగ్గుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: