బాడీ షేప్ పర్ఫెక్ట్ గా రావాలంటే పస్తులుండాలా?

Divya

ప్రస్తుతకాలంలో చిన్న వాళ్లతో పాటు పెద్ద వాళ్ళు కూడా అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. మరీ ముఖ్యంగా అమ్మాయిలు, ఆడవాళ్లు అని తేడా లేకుండా అధిక బరువుతో ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వారు బరువు తగ్గించుకోవాలనే నెపంతో ఎన్నో వ్యాయామాలు, ఎక్సర్సైజుల చేస్తూ ఉపవాసాలు  కూడా ఉంటున్నారు.  ఈ ఉపవాసాల కారణంగా చాలా మంది కడుపు మాడ్చుకొని, పస్తులు ఉండడంవల్ల  చివరికి ప్రాణం మీదికి కూడా తెచ్చుకుంటున్నారు, అయితే ఈ పద్ధతి సరైనదేనా? ఇలా చేయడం వల్ల  సన్నగా మారుతారా? అని అడుగుతున్నారు ఆరోగ్య నిపుణులు.



అసలు ఆరోగ్యకరమైన పద్ధతి అంటే ఏమిటి?
ఆహార నియంత్రణ తప్పనిసరిగా ఉండాలి. అయితే ఒక్కసారిగా ఆహారం  విషయంలో ఎలాంటి మార్పులు తీసుకోకూడదు. నెమ్మదిగా డైట్ లో మార్పులు తీసుకొచ్చి, డైట్ లో ఆహారాన్ని  తగ్గించుకోవడం వల్ల నీరసం,ఆకలి,అలసట రాకుండా ఆరోగ్యంగా ఉండొచ్చు. అలాకాక కడుపు మాడ్చుకొని పస్తులు ఉండడం వల్ల క్రమేణా సన్నబడతామేమో కానీ రాబోయే కాలంలో  తలనొప్పి,ఏ పని మీద శ్రద్ధ లేకపోవడం, దృష్టిలోపించడం లాంటి సమస్యలు ఎదురవుతాయి.

బరువు తగ్గాలనుకొనే వారికి మొట్టమొదటిగా ఓపిక అనేది ఎక్కువగా ఉండాలి. మొదటిగా చేయాల్సినవి.. ప్రతిరోజూ  ఉదయం క్రమం తప్పకుండా ఒకే సమయానికి నిద్ర లేవడం అలవాటు చేసుకోవాలి. ఆ తర్వాత ప్రతి రోజూ  వాకింగ్ చేయడం లాంటివి చేయాలి.  మొదట కేవలం 15 నిమిషాల నుంచి మొదలు పెట్టడం మంచిది. ఇక రోజు రోజుకి ఐదు నిమిషాల చొప్పున పెంచుకుంటూ పోతే సరిపోతుంది.


 ప్రతి రెండు గంటలకు ఒకసారి కొద్ది కొద్దిగా ఆహారం తీసుకోవడం మంచిది. ఇలా చేయడం వల్ల మన శరీరం కూడా ఈ ఆహారపు పద్ధతులకు అలవాటుపడి అనారోగ్యం పాలుకాకుండా హుషారుగానే ఉంటూ  బరువు తగ్గుతారు.


అంతేకాకుండా టీవీ చూస్తూ ఉంటే ఫోన్ చూస్తూ  ఆహారం తీసుకోవడం చాలా తప్పు.  ఇలా చేయడం వల్ల ఆకలి ఉన్నా లేకపోయినా మనకు తెలియకుండానే చాలా ఆహారాన్ని తీసుకుంటాము. కాబట్టి నలుగురిలో కూర్చుని తినడం వల్ల తక్కువ పరిమాణంలో తినడానికి వీలవుతుంది.

అంతేకాకుండా సరైన సమయానికి తినడం, పడుకోవడం, లేవడం,వ్యాయామం చేయడం, లాంటి పనుల  వల్ల అధిక బరువు ఇట్టే తగ్గి,అందంగా,నాజూగ్గా ఆరోగ్యంగా ఉండవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: