బియ్యం కడిగిన నీటిని పడేస్తున్నారా?

Divya

సాధారణంగా అందరి  ఇళ్లల్లో బియ్యాన్ని కడిగి,నీటిని పారబోస్తుంటారు. కానీ జపాన్, దక్షిణ కొరియా లో మాత్రం ఈ నీటిని బంగారంలా దాచుకుంటారట. బియ్యం కడిగిన నీటిలో ఎన్నో పోషకాలు, మినరల్స్ ఉంటాయని,అవి మన శరీరంతో పాటు అందానికి కూడా ఎంతగానో సహాయపడతాయి అని వారు ఎప్పటినుంచో విశ్వసిస్తున్నారు.అంతేకాకుండా బియ్యం నీటితో జుట్టు సంరక్షణ కూడా జరుగుతుంది. అయితే మొత్తానికి బియ్యం నీటి వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు ఇక్కడ పెరుగు తెలుసుకుందాం.

ముందుగా బియ్యాన్ని ఒకసారి కడిగి ఆ నీటిని పారబోయాలి. బియ్యంలో ఉండే దుమ్ము, ధూళి ఆ నీటి ద్వారా తొలగిపోతుంది.ఆ తర్వాత రెండవ సారి బియ్యాన్ని కడిగేటప్పుడు మాత్రం ఆ నీటిని దాచుకోండి. ఆ నీటిని వాడడం వల్ల చర్మం అందం కోసం ఎలాంటి క్రీములు,కాస్మెటిక్స్ వాడాల్సిన అవసరం లేదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఈ పద్ధతిని మాత్రం క్రమం తప్పకుండా రోజూ ఉదయాన్నే పాటించాలని కూడా వారు సూచిస్తున్నారు.

ఇందుకోసం ముందుగా బియ్యాన్ని 15 నిమిషాలు నానబెట్టి,ఆ నీటి నుండి బియ్యాన్ని వేరు చేయాలి. ఇప్పుడు ఆ నీటిని తీసుకుని ఫ్రిజ్ లోని ఐస్ క్యూబ్స్ ట్రేలో వేయాలి.ఆ ట్రేలో  నీరు గడ్డకట్టి  క్యూబ్ లాగా తయారవుతాయి. వాటిని స్నానానికి వెళ్లే పది నిమిషాల ముందు ముఖంపై వృత్తాకారంలో మర్దనా చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ముఖం మీద డెడ్ స్కిన్ సెల్స్ తొలగిపోయి చర్మం కాంతివంతంగా తయారవుతుంది.

అంతేకాకుండా బియ్యం నీటిని ఒక స్ప్రే బాటిల్ లో వేసుకొని,మేకప్ వేసుకునే ముందు  క్లెన్సింగ్ లాగా కూడా ఉపయోగించుకోవచ్చు.  తద్వారా సూర్యరశ్మి నుంచి వెలువడే అతినీలలోహిత కిరణాల నుండి చర్మాన్ని డ్యామేజ్ చేయకుండా బియ్యం నీళ్లు కాపాడతాయి. ఈ బియ్యం నీళ్లు కేవలం చర్మానికి మాత్రమే కాకుండా జుట్టు సంరక్షణకు కూడా ఎంతో సహాయపడతాయి. స్నానానికి  వెళ్ళే అరగంట ముందు బియ్యం నానబెట్టిన నీళ్లను తీసుకొని కుదుళ్లలో పట్టించి, మునివేళ్లతో మార్ధనా  చేయాలి. ఆ తరువాత గాఢత తక్కువ కలిగిన షాంపూతో తలస్నానం చేస్తే జుట్టు రాలే సమస్య నుంచి బయటపడవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: