మొటిమలు మచ్చలు శాశ్వతంగా దూరం అవ్వటానికి ఈ పద్ధతులు పాటించండి....
మజ్జిగ, బాదంపాలు ఇంకా లస్సి అలాగే నీరు అధికంగా ఉండే పండ్లు, కూరగాయలు అన్నీ చర్మంకు మేలు చేస్తాయి. ఎందుకంటే మీరు నీటితో కూడిన ఆహారాన్ని తీసుకున్నప్పుడు, మీ చర్మం లోపలి నుండి ఎక్కువసేపు హైడ్రేట్ గా ఉంటుంది. ఆపిల్, కీర దోసకాయలు, ద్రాక్ష మొదలైనవి తినండి. పుచ్చకాయ ఇంకా గులాబీ రంగులో ఉండే ద్రాక్షపండులో కూడా ఇంటర్నల్ ఎస్ పీ ఎఫ్ ఇంకా సూర్యరశ్మి నుండి చర్మాన్ని కాపాడే లక్షణాలు కలిగి ఉంటాయి.ఈ ఆహారాలు మొటిమలు రాకుండా మీ చర్మాన్ని కాపాడుతాయి.
మొబైల్స్ ని ఎక్కువసేపు ఉపయోగించినప్పుడు వాటి నుండి వెలువడే నీలి రంగు లైట్ మీపై పడకుండా ఉండటం కోసం అద్దాలు ధరించడం వంటి చిన్న మార్పులు చేయండి.మొబైల్స్ మీద క్రిములు ఎక్కువగా ఉంటాయి. మీరు మొబైల్ ని తాకినప్పుడు అవి మీ చర్మం పైకి వస్తాయి. అందువల్ల మొటిమలు వస్తాయి. కాబట్టి ఎలక్ట్రానిక్ వస్తువులు ఎక్కువ వాడవద్దు. రెగ్యులర్ విరామం తీసుకోవడానికి టైమర్లను సెట్ చేసుకోండి ఇంకా ఆ విరామాలను పెంచడానికి ప్రయత్నించండి. బ్లూ లైట్ ఇంకా పర్యావరణ సమస్యలను చురుకుగా ఎదుర్కోవడంలో సహాయపడే మంచి ఉత్పత్తులను కూడా మీరు ఉపయోగించవచ్చు.ఇక ఇలాంటి ఎన్నో సౌందర్య చిట్కాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి...