ఇంట్లోనే ఈజీగా బాడీ వాష్ తయారు చేసుకోండిలా..!
ఆల్మండ్ ఆయిల్ మరియు షీబటర్ బాడీ వాష్...ఈ బాడీ వాష్ తయారీకి అరకప్పు షీ బటర్, అరకప్పు ఆల్మండ్ ఆయిల్, ఒక కప్పుడు లిక్విడ్ కాస్టిల్ సబ్బు అలాగే పది చుక్కల రోజ్ ఎసెన్షియల్ ఆయిల్ అవసరపడతాయి. షీ బటర్ ను మైక్రోవేవ్ చేయండి. ఆల్మండ్ ఆయిల్ ను కలపండి. అలాగే లిక్విడ్ కాస్టిల్ సబ్బుతో పాటు రోజ్ ఎసెన్షియల్ ఆయిల్ ను కలపండి. జెంటిల్ గా షేక్ చేయండి. ఈ బాడీ వాష్ షెల్ఫ్ లైఫ్ ఆరు నెలల నుంచి ఒక సంవత్సరమని గుర్తుంచుకోండి.
కొబ్బరిపాలతో హోమ్ మేడ్ బాడీ వాష్....ఈ బాడీ వాష్ వల్ల సెన్సిటివ్ అలాగే ఆయిలీ స్కిన్ కలిగినవారికి ఎంతో బెనిఫిట్ అందుతుంది. ఒక కప్పుడు కొబ్బరిపాలు తీసుకోండి. అందులో ఏదైనా రెండు కప్పుల మైల్డ్ లిక్విడ్ సోప్ ను కల పండి. అలాగే ఏదైనా ఎసెన్షియల్ ఆయిల్ ను రెండు స్పూన్స్ కలపండి. జొజోబా ఆయిల్ ఐతే మరీ మంచిది. అలాగే నాలుగు నుంచి ఐదు చుక్కల ల్యావెండర్ ఎసెన్షియల్ ఆయిల్ ను కూడా కలపొచ్చు. ఆ తరువాత రెండు టీస్పూన్ల గ్లిజరిన్ ను అలాగే ఒక టీస్పూన్ రా హానీను కలపండి.మొదట, కొబ్బరిపాలను ఒక ట్రాన్స్పరెంట్ బాటిల్ లోకి తీసుకోండి. ఆ తరువాత లిక్విడ్ సోప్ ను పోయండి. బాగా కలపండి. స్నానం చేసేటప్పుడు ఈ మిశ్రమాన్ని లూఫాపైకి తీసుకుని స్నానాన్ని ఎంజాయ్ చేయండి.ఈ బాడీ వాష్ ను కూడా మొదటి సంవత్సరంలోనే పూర్తిచేయాలి.