అందం: రోజ్ వాటర్‌తో ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే.. స్కిన్ మెరిసిపోవడం పక్కా..!!
అందం కోసం ఆరాటపడని వారుండరు. ఇందుకు ఏవేవో ప్రయోగాలు చేస్తుంటారు. ఈ క్రమంలోనే చర్మ సౌందర్యం కోసం మార్కెట్లో లభించే రకరకాల క్రీములు వాడేస్తుంటారు. వేలకు వేలు ఖచ్చు చేసి బ్యూటి పర్లర్స్ చుట్టూ తిరుగుతుంటారు. కానీ, శాశ్వత ప్రయోజనం లేక బాధపడుతుంటారు. కానీ, రోజ్ వాటర్ ఎలాంటి ఖర్చు లేకండా స్కిన్‌ను మెరిసిపోయేలా చేస్తుంది. ప్రకృతిలో లభించే పూలెన్నో. వాటిల్లో గులాబీ పువ్వులకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. గులాబీల ద్వారా తయారుచేసే రోజ్ వాటర్ వల్ల కూడా ఎన్నో ప్రయోజనాలున్నాయని నిపుణులు చెబుతున్నారు.
ఇక చర్మ ఆరోగ్యాన్ని సంరక్షించడంలో దీని తరువాతే ఏదైనా ... ఖరీదైనా టోనర్స్, సన్ స్క్రీన్ లోషన్స్, క్రీమ్స్ అన్నింటి పని రోజ్ వాటర్ చేసేస్తుంది. రోజ్‌వాటర్‌ని టోనర్ గా ఉపయోగించడం వల్ల ఇది ముఖంలో ముడుతలు, మచ్చలు తగ్గుతాయి. అంతేకాక చర్మంపై మొటిమలు, మచ్చలు పెరిగితే రోజ్ వాటర్ మిక్స్ చేసిన నీటితో ముఖానికి క్లీన్ చేసుకుంటుంటే మంచి ఫలితం ఉంటుంది. అలాగే రాత్రి పడుకునే ముందు కాటన్ బాల్‌తో రోజ్ వాటర్‌ను ముఖానికి అప్లై చేసి పడుకోవాలి. ఇలా ప్రతి రోజు చేయడం వల్ల మీ అందం ఖచ్చితంగా రెట్టింపు అవుతుంది.
ఎందుకంటే.. చర్మాన్ని కాంతివంతంగా మార్చే శక్తి రోజ్ వాటర్‌కు ఉంది. ఇక ముఖ్యంగా సన్ బర్న్ అయిన ప్రదేశంలో కొద్దిగా రోజ్ వాటర్ ను అప్లై చేస్తే సన్ బర్న్ నుండి ఉపశమనం కలుగుతుంది. రోజ్ వాటర్ గురించి మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే యాంటీ సెప్టిక్, యాంటీబ్యాక్టిరియాల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి చర్మానికి ఆరోగ్యానికి ఎంతో మంచివి. అలాగే చర్మానికి ప్రకాశవంతంగా మార్చడంతో రోజ్ వాటర్ గ్రేట్‌గా సహాయపడుతుంది. ఇక రోజ్ వాటర్‌ని స్నానం చేసేటప్పుడు నీటిలో కలుపుకుంటే మీ మృదువైన చర్మాన్ని సొంతం చేసుకోవచ్చు.