మెడ అందంగా ఉండాలంటే

Durga
 ముఖానికి మసాజ్ చేసేటపుడు చాలామంది మెడని, కంఠాన్ని పట్టించుకోరు. ముఖం కాంతివంతంగా ఉండి మెడ బాగం నల్లగా ఉంటే బాగుండదు. అందుకే కొన్ని చిట్కాలు .. చిక్కని పెరుగును కంఠానికి, మెడకు బాగా రాయాలి. అలా రాసేటప్పుడు కంఠాన్ని చేతితో గడ్డం వైపు పైకి మర్ధనా చేయాలి.  గడ్డం కిందనుండి మసాజ్ చేస్తే చర్మం ముడతలు పడుతుంది. మీగడలో కొంచెం నిమ్మరసం, కొద్దిగా పసుపు, ఒక స్పూన్ తేనె కలుపుకుని మెడకు కంఠానికి మసాజ్ చేయండి. ముడతలు పోయి, మెడ కంఠం నున్నగా ఉండి పసుపుగా తయారవుతుంది. ఎండలో కి వెళ్లెటపుడు మెడకు, కంఠానికి ఎండ తగిలితే నులుపుగా మారుతుంది.  అందుకు దోసకాయ గుజ్జును మెడకు, కంఠానికి రాస్తే నలుపు పోతుంది. మడ, కంఠం భాగాలలో నలుపు ఎక్కువగా ఉన్నట్లయితే పచ్చి కొబ్బరి పాలు బాగా మర్ధనా చేయండి. నలుపుపోయి చర్మం కాంతివంతంగా మారుతుంది. ముఖానికి అనేక రకాల క్రీములు, మిశ్రమాలు ఉపయోగించేవారు వాటిని మెడ కంఠాలకు కూడా రాసుకోండి.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: