మూడ్ కి తగినట్లు.. నగలు ధరించడం ఒక ఆర్ట్

Durga
నగలు ఎప్పుడూ కూడా మీ వయసు సమయం, సందర్భం, మీ ముఖ ఆకృతులకు తగినట్టుగా ధరించాలి. లేదంటే మీకు అసౌకర్యంగాను. చూసేవారికి ఎబ్బెట్టు గాను ఉంటుంది. రెండులేదా మూడు గొలుసులను కలిపి వేసుకుంటే ఓ కొత్త ఆభరణంలా కన్పిస్తుంది. ఒక గొలుసు పొడుగు తగ్గించి వేసుకోవచ్చు.  అయితే గోలుసుల డిజైన్ మ్యాచ్ కావాలి. లేదంటే చూడటానికి ఎబ్బెట్టుగా ఉంటుంది. పొడుగాటి గొలుసు తీసుకుని రెండు పేటాలుగా వేసుకుని వెనుక వైపు సన్నని దారంతో ముడివేయాలి. ఈ ముడి కన్పించకుండా మానేజ్ చేసుకోవాలి.  ఓపొడవాటి ఛైన్ ఒకదానిని తీసుకుని మెడకు దగ్గరగా నెక్లెస్ లాగా సర్దుకుని వెనుక తాడుతో కట్టవచ్చు. మీరు మెడలో వేసుకున్న గొలుసుకు మ్యాచ్ అయ్యే మరొక గొలుసును చేతికి చుట్టుకోవచ్చు. ఇది బ్రేస్లేట్ గా కట్టోచ్చు మీ సృజనాత్మకతకు పదును పెట్టి మరికొన్ని పద్దతులు కనిపెట్టండి. ఇలా వెరైటీగా నగలు ధరించండి. ఉదయం వేళ పూసలు, స్టోన్స్ పొదిగిన గొలుసులు ధరిస్తే బావుంటుంది. చెవిదిద్దులు : మీ ముఖం గుండ్రంగా ఉంటే గుట్రవి చెవి దిద్దులు బాగుంటాయి. మీరు సన్నగా కనబడాలనుకుంటే త్రిభుజాకారంలో పొడవుగా ఉంటే చెవి కమ్మలు ధరించాలి. ముఖం చదరంగా ఉంటే గుండ్రటి ఇయర్ రింగ్స్ బాగుంటాయి. కోలముఖం వారికి చదరంగా ఉండేవి. పెద్ద దిద్దులు ధరిస్తే నప్పుతుంది. చెవిదిద్దులు, కమ్మలు కొనేవారు మొదట అవి తమకు సూటవుతాయా లేదా పరిశీలించిన మీదటే కొనుక్కోవాలి. చెవిదిద్దులు, రింగ్స్ లను చెవులకే పెట్టుకోవాలన్న రూలేమి లేదు, మీరు ధరించే దపట్టాలకు, సారీపిన్స్ గా కూడా చెవిదిద్దులు రింగ్స్ ను ఉపయోగించవచ్చు. కొంచెం పాడైన వాటిని చెప్పుల మీద అతికించవచ్చు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: