ముఖం అందంగా ఉందా లేదా ?
మొటిమలు, మచ్చలు, ఏమైనా ఉన్నాయా?
అయ్యో అప్పుడే ముఖం మడతలు పడిపోతోందే. ఎన్నోరకాలుగా ఆందోళన చెందుతాం. కానీ చేతుల గురించి మాత్రం పట్టించుకోం, నిజానికి వయసు ప్రభావం ముందుగా కన్పించేది చేతలు మీదనే అదువలన ఈ జాగ్రత్తలు పాటించండి.
చేతులకు సన్ స్ర్కీన్ లోషన్ రాసుకుంటారే కానీ చేతులకు రాసుకోరు. ఈ లోషన్ రాసుకునే ఉద్దేశ్యం ఏంటంటే మన చర్మం మీద అతినీలలోహిత కిరణాల ప్రభావం పడకూడదనే కాబట్టి ఇక నుంచి ముఖానికి రాసుకునే సన్ స్ర్కీన్ లోషన్ చేతులకు కూడా రాసుకోండి.
హ్యండ్ క్రీమ్స్ ప్రస్తుతం మార్కెట్లో చేతులకు రాసుకునే క్రీమ్లు హ్యండ్ క్రీమ్స్ పేరిట లభిస్తున్నాయి. వీటిని క్రమం తప్పకుండా చేతులకు రాసుకుంటే చేతులు మృదుత్వాన్ని సంతరించుకుంటాయి. ఒకవేళ చేతులమీద చర్మ జారిపోయినట్టుగా ఉన్నా ముడతలు పడినా సరి అవుతుంది.
యాసీడ్ ఫిల్స్ చర్మవ్యాదులు కెమికల్, లేజర్ పీల్స్ను ఉపయోగించడం ద్వారా ముఖంమీద ఏర్పడిన ముడతలు సరిచేయవచ్చుని అంటున్నారు. వాళ్లు చెప్తున్నదేంటంటే హైడ్రాక్స్ యాసీడ్ పీల్స్ ద్వారా చేతులు ముడతలు పడితే వీటిని సరిచెయవచ్చట.
అంతేకాదు ప్రస్తుతం చేతులు యంగ్ గా కనిపించాలంటే మనకు అందుబాటులో ఉన్న శాశ్వత పరిష్కారం ఇది ఒక్కటేనని న్యూయార్క్ కి చెందిన చర్మవైద్యుడు హోవార్డ్ నెబెల్ అంటున్నారు. ఇంకా ...... రోజూ రాత్రి పూట నిద్రపోయే ముందు చేతులకు మాయిశ్చరైజర్ కానీ హ్యాండ్ క్రీమ్స్ కానీ రాసుకోండి. బట్టలు ఉతికేటప్పడు, పాత్రలు తోమేటప్పుడు చేతులకు గ్లౌజులు ధరించండి.
మీ ముఖానికి ఏదైనా ప్యాక్ వేసుకుంటే చేతులకు కూడా ఆప్లై చేయండిజ తరుచుగా మానిక్యూర్ చేసుకుంటూ ఉండాలి. లేదా కనీసం గోరువెచ్చని నీళ్లల్లో కొద్దిగా మాయిశ్చరైజర్ కలిపి మీ చేతులు అందులో మునిగేలా ఉంచాలి.
అయిదు నిమిషాల తర్వాత చేతులకు బయటకు తీసి మాయిశ్చరైజర్ రాసుకుంటే సరిపోతుంది.
మరింత సమాచారం తెలుసుకోండి: